5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionవిద్యా రంగానికి జకీర్ హుస్సేన్ విశిష్ఠ సేవలు

విద్యా రంగానికి జకీర్ హుస్సేన్ విశిష్ఠ సేవలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారత దేశపు మొదటి ముస్లిం రాష్ట్రపతి, పదవిలో మరణించిన మొదటి భారత దేశ ప్రథమ పౌరులు జాకీర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 – మే 3, 1969). ఆయన మే 13 1967 నుండి మరణించినంత వరకు రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. భారత 3వ రాష్ట్రపతి జాకీర్ హుసేన్ హైదరాబాదు (భారత దేశం)లో జన్మించారు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందిన వారు. అయన హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చారు. హుస్సేన్ ప్రారంభ ప్రాధమిక విద్య హైదరాబాద్‌లో పూర్తయింది. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని ‘ఇస్లామియా ఉన్నత పాఠశాల’ లో చదువు కున్నారు. లక్నో విశ్వ విద్యాలయం క్రిస్టియన్ డిగ్రీ కాలేజీ నుండి ఎకనామిక్స్ లో పట్టభద్రు డయ్యారు. ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించారు. ఇచట విద్యార్థి సంఘ నాయకునిగా గుర్తింప బడ్డారు.18 సంవత్సరాల వయస్సులో, అయన షాజహాన్ బేగంను వివాహం చేసుకున్నారు.

జాకీర్ హుస్సేన్ 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందంతో అయన నేషనల్ ముస్లిం విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు. మొదట అలీఘర్లో 1920 అక్టోబర్ 29 శుక్రవారం స్థాపించ బడింది, తరువాత 1925 లో న్యూ ఢిల్లీ లోని కరోల్ బాగ్ కు మార్చబడింది. తరువాత మార్చి 1, 1935 న న్యూ ఢిల్లీలోని జామియా నగర్ కు మళ్లీ మార్చ బడింది. దీనికి జామియా మిలియా ఇస్లామియా (కేంద్ర విశ్వ విద్యాలయం) అని పేరు పెట్టారు.

జాకీర్ విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, ‘బెర్లిన్ విశ్వ విద్యాలయానికి (జర్మనీ) వెళ్ళారు.1926 లో బెర్లిన్ విశ్వ విద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ, కవితా సంగ్రహాలను క్రోడీకరించారు.1927 లో మూసివేతను ఎదుర్కొంటున్న జామియా మిలియా ఇస్లామియాకు నాయకత్వం వహించడానికి అతను భారత దేశానికి తిరిగి వచ్చాడు.
భారత దేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆయన పదవిలో కొనసాగారు. మార్గ దర్శకులుగా మారారు. ముహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల (ఇప్పుడు అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం) వ్యవహారాల్లో ముఖ్యంగా చురుకుగా ఉన్నారు. మహమ్మద్ అలీ జిన్నా వంటి రాజకీయ ప్రత్యర్థుల ప్రశంసలను పొంందారు.

బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులు కలిపి, “బేసిక్ విద్య” పై కఠోర పరిశ్రమ చేశారు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించారు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యా విభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందారు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేత కూడా పొగడ బడ్డారు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశ భక్తులు.

భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవిని అంగీకరించారు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, అయన నియామకం ఎంతో ఉపయోగ పడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయ బడ్డారు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింప బడి, పార్లమెంటుకు రాజీనామా చేశారు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించారు. తదనంతరం మే 13 1967 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకో బడ్డారు. అయన ప్రథమ ఉపన్యాసంలో “మొత్తం భారత దేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం” అని పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవీ కాలంలో, హుస్సేన్ హంగరీ, యుగోస్లేవియా, యుఎస్ఎస్ఆర్ మరియు నేపాల్ లకు నాలుగు దేశాలకు పర్యటించారు.1969 మే 3 న అయన మరణించగా, న్యూ ఢిల్లీ లోని జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో ఖననం చేశారు.

అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు – డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments