విజయవాడపై జగన్ ఫోకస్… యువనేతకు కీలక బాధ్యతలు👉 ఓ వైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్న జగన్…
మరోవైపు ఏపీలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్న జగన్…
మరోవైపు ఏపీలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్‌ను వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చింది. దేవినేని అవినాష్‌ను వైసీపీలోకి ఆహ్వానించడం వెనుక జగన్ లెక్క వేరే ఉందని…
విజయవాడలోని ఓ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే ఆయన గురి పెట్టారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇందుకు తగ్గట్టుగానే అవినాష్‌కు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు జగన్.
ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న బొప్పన భవకుమార్‌ను వైసీపీ నగర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ… విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో మాత్రం విజయం సాధించలేకపోయింది.
దీంతో ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న సీఎం జగన్… ఇందుకోసం టీడీపీ నేతగా ఉన్న దేవినేని అవినాష్‌ను ఎంపిక చేసుకున్నారు