5.1 C
New York
Saturday, June 3, 2023
Homespecial Editionయోగానంద నరసింహ ఏకాంతోత్సవం

యోగానంద నరసింహ ఏకాంతోత్సవం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


నృసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి చాలా సేపటి వరకునిర్వహించిన శ్రీ లక్ష్మీ సమేత యోగానంద నరసింహుని ఏకాంతోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి. స్వామి ఏకాంతోత్సవ సందర్భంగా, మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన భక్తులు హర్గుల్ వార్ శంకర్ ప్రతి ఏటి లాగే సమర్పించిన వివిధ పుష్పాలతో ఆకర్షణీయంగా స్వాముల మూల విరాట్టులను అలంకృతుల గావించారు. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై రాత్రి చాలా సేపటి వరకు కొనసాగిన స్వామివారి ఏకాంతోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రధానాలయంలో, స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి, గరుడ స్థంభం వద్ద నిలిపి, ప్రత్యేక ఉత్సవ పూజలొనరించారు. వేద, శాస్త్ర, పురాణ, నృత్య, సంగీత, వాద్య, మౌన అదిగా గల సప్త ఆవరణ ప్రదక్షిణ లలో బోయీలు, భక్తులు స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు తిప్పగా, భక్తులు అనుసరించారు. దేవస్థానం వంశపారంపర్య పౌరోహితులు కందాల పురుషోత్తమాచార్య, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశర్మల మార్గ నిర్దేశకత్వంలో దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ సంకటాల, వివిధ ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్య. రమణాచార్య, నరసింహ మూర్తి, అశ్విన్, వంశీలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. సప్తమ ప్రదక్షిణల అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణానగల మంటపం లోని ఊయలలో లక్ష్మీ, కళ్యాణ యోగానంద నృసింహుని పవళింపు గావించి, అలౌకికానంద భరితులైన భక్తజన సమక్షంలో కన్నుల పండువగా వైకుంఠ నాథుని, లక్ష్మీదేవి ఏకాంత వేడుకలను సాంప్రదాయ రీతిలో నిర్వ హించారు. పవళింపు సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణాదులను నిర్వహించారు. విశేషార్చనలు చేశారు. వేదవిదుల మహదాశీర్వచనాన్ని గావించి, ప్రసాద వితరణ చేశారు.

ఘనంగా వేంకటేశ్వర పుష్పయాగం

బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి పుష్ప యాగాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా కలియుగ వేలుపైన వెంకన్న ప్రీతికై దేవస్థాన యాజ్ఞకులు కందాలై పురుషో మాచార్య, వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ఆచార్యత్వంలో ఆలయ ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీధరాచార్య. శ్రీనివాసా చార్యలు భక్తి శ్రద్ధాసక్తులతో వాసుదేవ ద్వాదశాక్షరీ గోపాల పూజ యుక్త (నాగవెల్లి) పుష్ప యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వర మందిరంలోని మంటపంలో, పంచవర్ణాలతో చక్రాబ్జమును చిత్రించి, పుష్పాలం కృత శోభాయమాన పీఠమందు వేంకటనాథుని వేంచేపు చేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి రుక్, యజుర్, సామాధర్వణ వేదాలతో, శాస్త్ర సంగీతాది కళలతో స్వామిని సేవించారు. దేవస్థాన అభివృద్ది కమిటీ చైర్మెన్ రామయ్య, సభ్యులు, ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments