5.1 C
New York
Wednesday, March 29, 2023
Homespecial Editionనీటి పరిరక్షణ సామాజిక బాధ్యత

నీటి పరిరక్షణ సామాజిక బాధ్యత

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండినీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము. మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో నీరూ అంతే అవసరం. నీరే లేకపోతే పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహాసముద్రాలు ఏమీ ఉండవు. ఇవేమీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు.

అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి 1993 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 22న అంతర్జాతీయ
జల దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. ఐక్య రాజ్య సమితి, ప్రపంచ జల దినోత్సవాన్ని 1992 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, రియో డి జెనీరియో సమావేశంలో ప్రతిపాదించింది. దీన్ని 1993వ సంవత్సరం నుంచి నిర్వహించడం ప్రారంభించారు.
మెరుగైన మంచి నీటి వనరుల నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహనా కల్పించడం కోసం ఐక్య రాజ్య తెలంగాణ ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతుంది.

భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరుల తోనే ముడిపడి ఉంది. నీటిని పరిరక్షించు కోవాలనే నినాదాన్ని ప్రాచీన నాగరికతలు వెల్లడించాయి.
భారతీయులకు నీటి విలువ తెలుసు కనుకే నదులను పూజించే ఆచారం ఉంది. నీటిని పూజించి, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు. నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీమహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీటిని వృధా చేయడం సృష్టికి, భగవత్తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకమని పురాణాలు, ప్రాచీన గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

నీరు మూడు రూపాలలో… ఘన రూపం అంటే మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం, సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి, వాయు రూపంలో భూమండలం పై 71 శాతానికి పైగా ఆవరించి ఉంది. క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థముల తోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రము ద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయు రూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించ గానే ద్రవించి తిరిగి వర్ష రూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆ కలుషిత మేఘాలు వర్షించినపుడు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.

జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవ రసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవ పదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది.

నీటి ఎద్దడిని ప్రపంచంలో 80 దేశాలు ఎదుర్కొంటున్నాయి. గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచి పోవాల్సిన పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. మంచి నీల్లు దొరకక కుంటల్లో, గుంటల్లో అడుగు బొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితిలో ఎంతో మంది ఉన్నారు. వేసవిలో చాలా చోట్ల నీటి కొరత మూలంగా, కనీసం తాగు నీరు దొరకక ఎంతో మంది బిందెలతో బహు దూరం కిలో మీటర్ల వరకు నడిచి వెళ్లి త్రాగు నీటిని తెచ్చుకునే అనివార్య పరిస్థితులను చూస్తూనే ఉన్నాం.

మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. మనం నివసించే భూగోళంలో ఉన్న నీటి వనరులలో 99% ఉన్నది ఉప్పునీరే. ఇది 97% సముద్రాల్లోనే ఉంది. మిగతాది నదులు, చెరువుల్లో ఉంది త్రాగడానికి పనికొచ్చే నీరు 1% మాత్రమే. ఇందులో చెరువుల్లో 0.86%, నదుల్లో 0.02% ఉండగా మిగిలినవి భూగర్భ జలాలు. ప్రపంచ వ్యాప్తంగా త్రాగడానికి ఉపయోగపడే నీరు 0.3% మాత్రమే.

నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ. జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడి పోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు ఉండనే ఉండదని. ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు రాసుకుంటారనీ..(కెమికల్ బాత్) వాటితోనే స్నానాలు చేస్తారనీ..దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన సైనికులు నీటి వనరుల చుట్టు కాపలా కాసా పరిస్థితి ఉంటుందని.. తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.

నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా.. ఉన్న నీటిని సద్వినియోగం చేసు కోవడం, వృథాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వి నియోగం..తదితరాలన్నింటికీ ప్రాధాన్య మివ్వాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments