5.1 C
New York
Sunday, April 2, 2023
Homespecial Editionక్షయపై ఉన్న అపోహలను పారదోలాలి...

క్షయపై ఉన్న అపోహలను పారదోలాలి…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న నిర్వహిస్తారు. భయంకర మైన అంటు వ్యాధైన టీబీ (క్షయ) దేశంలో ప్రతి సెకనుకు ఒక్కరికి సోకుతున్నదని, ప్రతిరోజు 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 నుండి క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.1882, మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మ క్రిములను (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్) మొదటి సారిగా కనుగొన్నాడు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్, రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 120 సంవత్సరాలు కావస్తున్నాయి.

ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా 7 వేల ఏళ్ల క్రితమే మనుగడ సాగించినట్లు, అత్యంత ప్రాచీన క్షయ కేసు 7వేల ఏళ్ళ క్రితమే ఉన్నట్లు స్జెగెడ్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు మురియెల్ మాసన్ పరిశోధనలో వెల్లడైంది. హైపర్‌ ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి (హెచ్‌పీవో) అనే వ్యాధికి వేల సంవత్సరాల క్రితం క్షయ కారణమనీ, పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగరీలో ఏడువేల సంవత్సరాల క్రితంనాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు. వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ సంబంధ వ్యాధులకు సంబంధించి పలు కేసులను గుర్తించారు. కొన్ని అస్థిపంజరాల్లో హెచ్‌పీవోకు సంబంధించిన సంకేతాలు కూడా గుర్తించడంతో క్షయ అప్పట్లోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు.
టీబీ కారణంగా ఇండియాలో ఏటా 4,80,000 మరణాలు సంభవిస్తున్నాయి. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం క్షయ కారణంగా దేశంలో రోజుకి 1,300 మంది చనిపోతున్నారు.

గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అంతం కావడం లేదు. అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారు.


క్షయ అనగానే దగ్గు గుర్తుకు రావడం సహజం, తద్వారా కేవలం ఊపిరి తిత్తులకు మాత్రమే క్షయ వ్యాధి కలుగుతుందని అనేకమంది భావిస్తుంటారు. కానీ క్షయ వ్యాధి అనేది, శరీరంలో ఏ భాగానికైనా రావొచ్చు. చర్మం, గర్భాశయం మొదలైనవి. అదే విధంగా మెదడుకు కూడా క్షయవ్యాధి సోకుతుంది. తద్వారా మెదడులోని రక్తనాళాలు వాపునకు గురవడం జరుగుతుంది. దీనిని మెనింజైటిస్ క్షయ వ్యాధిగా కూడా పిలుస్తారు.

క్షయ రోగాన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించే వారు. కానీ క్రమేపీ దాన్ని నిరోధించటం, నివారించటం మొదలైంది. మైకో బాక్టీరియం క్షయ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తుల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అయితే ఇది శరీరంలోని ఏదైనా అవయవానికి కలిగి ఉంటుంది. క్షయ అనేది నయం చేయగల మరియు నివారించగల వ్యాధి. ఊపిరితిత్తుల టిబి దగ్గు, తుమ్ము లేదా బిందువుల ద్వారా ఉమ్మివేసినప్పుడు ఇది వ్యక్తి నుండి వ్యక్తికి గాలి ద్వారా వ్యాపిస్తుంది.

టిబి ఉన్న వ్యక్తి దగ్గు, నిరీక్షణ, హిమోప్టిసిస్, జ్వరం, రాత్రి చెమటలు, ఆకలి లేకపోవడం లేదా 2 వారాల కన్నా ఎక్కువ బరువు తగ్గడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. క్షయవ్యాధి నిర్ధారణ మరియు చికిత్స పూర్తిగా ఉచితం మరియు జాతీయ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామర్ (ఎన్‌టిఇపి) చేత సమన్వయం చేయబడుతుంది.


మెదడు క్షయ వ్యాధి కారకాలు ప్రధానoగా…ఎక్కువ మద్యం సేవించడం, ఎయిడ్స్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, డయాబెటిస్ మెల్లిటస్ (రక్తంలో చక్కర నిల్వలు అమాంతం పెరిగి పోవడం, ఇన్సులిన్ స్థాయిలు హీనంగా తగ్గిపోవడం) తదితరాలు కారకాలుగా ఉంటాయి.


సాధారణంగా ఎక్స్-రే, గళ్ళ పరీక్షలతో 60% నుంచి 70 శాతం కేసుల్లో టి.బి అని నిర్ధారించవచ్చు. వీటితో నిర్దారణ కాకపోతే అప్పుడు సెరోలజీ, పీసీఆర్, మాంలో వంట్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇవేగాక అవసరాన్ని బట్టి సీటీస్కాన్, టోన్స్కాన్, బయాప్సీ వంటి పరీక్షలు చేయించాలి.
మెదడు క్షయ వ్యాధిని తగ్గించుకునే చికిత్సలో ప్రధాన భాగం ఆహార ప్రణాళికలలో మార్పులు చేయడమే. శరీరంలో రోగ నిరోధక శక్తి తత్వాలు పెరిగే కొలదీ, రోగాన్ని ఎదుర్కొనే శక్తిని శరీరo పొందగలదు. కావున ఈ వ్యాధికి గురైన వారు తమ ఆహార ప్రణాళికలో తాజా పండ్లు, కాయగూరలు, మరియు ఆరోగ్యకర ప్రోటీన్ నిల్వలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు డైటీషియన్ సలహా మేరకు తీసుకొనవలసి ఉంటుంది. తద్వారా త్వరగా కోలుకునే అవకాశo ఉన్నది.

మెనింజెటిస్ క్షయ వ్యాధి సమస్యలు అత్యంత జఠిలo గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాంతకం కూడా కావొచ్చు.
చికిత్సా సమయంలో ముఖ్యంగా పండ్లనే ఎక్కువ తీసుకొనవలసి ఉంటుంది. చికిత్స పూర్తయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు పాలను కూడా తీసుకొనవచ్చు.
పాలలో అత్యధిక మోతాదులో కాల్షియం నిల్వలు ఉంటాయి, కావున మెదడు క్షయ వ్యాధికి గురైన వారికి మంచి ఆహారంగా సూచించ బడుతుంది.

క్షయ వ్యాధి ఉన్న రోగి దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. క్షయ వ్యాధి గ్రస్తుడు దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల లోనికి ప్రవేశించి జబ్బుకు పునాది వేస్తుంది. కనుక వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత, ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయ కూడదు. ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

2025 నాటికి టిబిని అరిక‌ట్ట‌డం లక్ష్యంగా చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. దీర్ఘకాలిక సీక్వెల్ ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్స ద్వారా నివారించవచ్చు. క్షయవ్యాధి చికిత్స, వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలలో భాగంగా ఆరోగ్య కేంద్రాలలోనే అందు బాటులో ఉన్నాయి. ప్రస్తుతం రివైజ్డ్ టి.బి. కంట్రోలు ప్రోగ్రాంను ప్రభుత్వం అమలు పరుస్తోంది. క్రమం తప్పకుండా పూర్తి మోతాదులో మందులు వేసుకున్నట్టయితే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేసు కోవచ్చు. క్షయరోగి క్రమం తప్పకుండా, ఆపకుండా కనీసం ఆరునెలలపాటు మందులు వేసుకొనవలసి ఉంటుంది. కొంతమంది రోగులకు ఒక సంవత్సరం పాటు మందులు ఇవ్వవలసి ఉంటుంది. వైద్యులను సంప్రదించిన తరువాతనే వారి సలహా మేరకు మాత్రమే మందులు వేసుకొనడం ఆపివేయాలి.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments