Homespecial Editionకుష్టు వ్యాధిపై అవగాహన అవసరం

కుష్టు వ్యాధిపై అవగాహన అవసరం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

కుష్టు వ్యాధి బారిన పడిన ప్రజల సంరక్షణ కోసం మహాత్మా గాంధీ చేసిన నిస్వార్థ ప్రయత్నాలు, పడిన శ్రమను గుర్తుగా ఆయన వర్ధంతి అయిన 30 జనవరిని కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా జరుపు కుంటారు.

కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించు కోకపోతే అది పెరిగి చర్మానికి, నరాలకు, కాళ్లు, చేతులు, కళ్లకు హాని కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. చాలా నెమ్మదిగా వ్యాధి లక్షణాలు బహిర్గత మవుతాయి. ప్రారంభ దశలో గుర్తించి మల్టీ డ్రగ్‌ థెరఫీ తీసుకుంటే వ్యాధి అంగ వైకల్యానికి దారి తీయదు. చికిత్స పూర్తయిన, చికిత్స తీసుకుంటున్న రోగుల్లో అంగవైకల్యం ఉంటే శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చు. ఈ వ్యాధిని రెండు రకాలుగా గుర్తించి వాటికి వైద్యాన్ని అందిస్తారు. మొదటగా ఎంబీ (మల్టీ బ్యాచ్‌లరీ) అంటే మచ్చల సంఖ్య, స్పర్శ కోల్పోయిన వారికి ఏడాదిపాటు చికిత్స అందిస్తారు. రెండోది పీబీ (పాసి బ్యాచులరీ) ఇది కూడా మచ్చల సంఖ్య, స్పర్శ కోల్పోయిన వారికి ఆరు నెలలపాటు చికిత్స అందిస్తారు. 20శాతం మానవుడికి ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి కేవలం బ్యాక్టీరియా ద్వారానే (దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు) మాత్రమే సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు బయట పడటానికి 6 నెలల నుంచి 20ఏండ్ల సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఇంక్‌పేషెంట్‌ పీరియడ్‌ అని అంటారు.

వ్యాధి అభివృద్ధి లక్షణాలలో నరాల, శ్వాసనాళ, చర్మం, కళ్ళు క్షీణించడం ఉంటాయి, దీనివల్ల నొప్పి తెలుసుకునే సామర్థ్యం కోల్పోవడం, పునరావృత గాయాల కారణంగా అంత్య భాగాల పూర్తిగా దెబ్బతింటాయి. బలహీనత మరియు చూపు పేలవంగా ఉంటుంది. శరీరంపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు, మచ్చలపై స్పర్శ లేక పోవడం , నొప్పి తెలియకుండా ఉండడం, పాదాలు, చేతులు, వేళ్ల తిమ్మిర్లు ఉన్నా, చర్మం దళసరిగా మారడం, చర్మం.. ముఖ్యంగా ముఖం నూనె రాసినట్లుగా నిగనిగలాడుతూ కనిపించడం ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. కుష్టు వ్యాధి వంశపారంపర్యం కాదు. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు, వయస్సు, లింగ భేదం లేదు.
1940లో కుష్టు వ్యాధి నివారణకు డప్సోన్ కనుగొనబడే వరకు కుష్టు వ్యాధి చికిత్స కోసం చౌల్మూగ్ర నూనెను వాడేవారు.1970లో కుష్టు వ్యాధి నయంచేయడానికి రిఫాంపిసిన్, చలోఫజీమైన్ మరియు డప్సోన్ లతో కలసి ఉన్న బహుళ ఔషధ చికిత్స కనుగొన బడినప్పటికీ, 1982నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.

1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండునుంచి మూడు మిలియన్ల మంది ఈ వ్యాధికి గురై, వికలాంగులుగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పేర్కొంటు న్నాయి. గత రెండున్నర దశాబ్దాల కాలంలో సుమారు 15 మిలియన్ల మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి వ్యాధిని తగ్గించారు.

ముదిరిన స్థాయిలో ఉండే కుష్టు వ్యాధి గురించి ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనే రకాల అపోహలు ఉన్నాయి. వీటిని ఏజ్‌ ఓల్డ్‌ సోషల్‌ స్టిగ్మా అని కాని లెప్రసీ స్టిగ్మా అని కాని వ్యవహరిస్తుంటారు. ఈ స్టిగ్మా కారణంగానే బాధితులు తొలి దశలోనే స్వయంగా చికిత్సకు వైద్యుల వద్దకు రావడానికి జంకుతుంటారు. అందుకే ప్రజలలో కుష్టు వ్యాధిపై అవగాహన పెంపొందించాలి. వ్యాధి బారినపడ్డ వారికి అవసరమైన మేరకు సాధారణ మరియు ఉచిత చికిత్స అందించడానికి చర్యలు గైకొనాలి.
వ్యాధి బారిన పడిన వ్యక్తికి చర్మంపై వచ్చే పుళ్ళు మరియు నరాల బలహీనత వల్ల భౌతిక లోపాల విషయంలో మానసిక ధైర్యం పెంపొందించడానికి కృషి చేయాలి.
వ్యాధి బారిన పడిన వారందరికీ అవసరమైన శ్రద్ధ, చికిత్సతో పాటు పునరావాసం కల్పించే చర్యలు తీసుకోవాలి.

కుష్టు వ్యాధి నివారణలో భారతదేశం విజయవంతమైన కృషి చేస్తున్నది. 1955లో జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం, 1983లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం ప్రారంభించింది. 1983 నుండి దశల వారీగా బహుళ ఔషధ చికిత్స నిర్వహిస్తూ, 2005లో 10000 మంది జనాభాకు 0.95 మంది చొప్పున మాత్రమే ఉండేట్టుగా 31 డిసెంబర్ 2005 నాటికి కుష్టు వ్యాధి నివారణ జరిగింది. కుష్టు వ్యాధిని, 10000 మంది జనాభాకు ఒకరి వరకు తగ్గించడం ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించారు. మార్చి 2011లో ప్రాబల్యం రేటు 10000 జనాభాకు నుంచి 0.69 వద్ద నిలిచింది.
2012 నుండి ప్రత్యేక చర్యలకు ప్రణాళిక చేపట్టడం జరిగింది.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments