5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleLife styleసహజ సురక్షిత వైద్యం హోమియో

సహజ సురక్షిత వైద్యం హోమియో

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ హనీమాన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆయన జన్మించిన ఏప్రిల్ 10 న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపు కుంటారు. హోమియోపతి గురించి అవగాహన పెంచడానికి, హోమియోపతికి ప్రాప్యతను మెరుగు పరచడానికి దీనిని జరుపుకుంటారు. డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనీమాన్ ఏప్రిల్ 10, 1755వ సంవ‌త్స‌రంలో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జన్మించాడు. ఆయన హోమియోపతి, మానవ ఫార్మకాలజీ పితామహుడు, నానోమెడిసిన్ సృష్టికర్త. గొప్ప శాస్త్రవేత్త. ఈ సంవత్సరం 2021 హనీమాన్ 266 వ పుట్టినరోజు అవుతుంది. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని డాక్టర్ హనీమాన్ పుట్టిన జ్ఞాపకార్థం జరుపు కుంటారు. హోమియోపతిని మరింత అభివృద్ధి చేయడానికి సవాళ్లు, భవిష్యత్తు వ్యూహాలను అర్థం చేసుకోవడానికి జరుపు కుంటారు. నేడు ప్రపంచం లోని వందకు పైగా దేశాలలో హోమియోపతి వైద్య పద్ధతిని అనుసరిస్తున్నారు. హోమియోపతి రంగంలో ప్రపంచం లోనే అగ్రస్థానంలో ఉన్న దేశం భారత దేశం.

మలేరియా వ్యాధి నివారణకు సింకోన బెరడుతో చేసిన మందు వాడుతారని తెలుసుకున్న హనీమన్‌ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలను కున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసు కున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించడంతో పాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు.

హోమియోపతి అనేది గ్రీకు పదాల హోమియో నుండి ఉద్భవించింది. హోమియో అంటే సారూప్యత మరియు పాథోస్, అంటే బాధ లేదా వ్యాధి. ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతి మూల సూత్రం. సారూప్య లక్షణ వైద్యం.

హోమియోపతి నేడు పాటిస్తున్న అత్యంత ఆధునిక వైద్య విధానం, మరియు ఇది వ్యాధి యొక్క మూల కారణాన్ని పరిష్కరించడం ద్వారా రోగులకు లోపలి నుండి చికిత్స చేయగలదు. హోమియో పతి మందులు బాహ్య లక్షణాలను అదుపులో పెట్టటానికి ప్రయత్నించవు. బయటకి కనిపించే లక్షణాలకు మూల హేతువు ఏదో వాటి మీద పని చేస్తాయి. ఉదాహరణకు జ్వరం, దగ్గు మొదలయినవి బయటకి కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు పొడచూపగానే వాటిని వెంటనే అణచి పెట్టటానికి మందు వేసుకుంటే అసలు కారణంపై ప్రభావం చూపి, నయం కాగలదని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. హోమియోపతి మందులు ప్రకృతిలో లభించే మూలాల నుండి తయారు చేయబడతాయి. హోమియోపతి అనేది సురక్షితమైన, సున్నితమైన సహజమైన వైద్యం, హానిమన్ కనిపెట్టిన వైద్య సూత్రాలు నాలుగు…అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట (పొటెంటైజేషన్), వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి.

ప్రపంచంలోని వైద్య విధానాలలో అల్లోపతి అనే ఆధునిక వైద్యం (ఇంగ్లీషు వైద్యం) మొదటి స్థానం ఆక్రమించింది. దాని తర్వాత ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక వైద్య విధానాలున్నాయి. హోమియోపతి వైద్యం 2వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హోమియోపతి వైద్యాన్ని రెండవ అతి పెద్ద వైద్య విధానంగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా, రెండు వందల మిలియన్ల మందికిపైగా హోమియోపతిని రోజూ వైద్యం కోసం ఉపయోగిస్తారు.
ఈ చికిత్సా విధానం స్విట్జర్లాండ్, పాకిస్తాన్, మెక్సికో, ఇండియా, చైనా వంటి అనేక దేశాల జాతీయ ఆరోగ్య పద్ధతుల్లో పొందుపరచ బడింది. 66 దేశాల్లో ఈ హోమియోపతి వైద్యం ప్రాచుర్యంలో వుండగా, భారతదేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు. భారత దేశంలో వంద మిలియన్ల మంది వ్యక్తులు వ్యాధులను నయం కాగలవనే విశ్వాసంతో హోమియోపతి వ్యవస్థపై ప్రత్యేకంగా ఆధార పడుతున్నట్లు. ఒక నివేదిక చెపుతోంది.

ప్రస్తుతం రెండు లక్షల వేలకు పైగా రిజిస్టర్డ్ హోమియో వైద్యులు ఉన్నారు. హోమియోపతి భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైద్య వ్యవస్థలలో ఒకటి, వాస్తవానికి, ఆయుష్ (ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, మరియు హోమియోపతి) సేవలలో రెండవది. భారత దేశంలో ఆయుష్ వ్యవస్థలతో పోల్చితే వినియోగ దారులు, అభ్యాసకులు, విద్యా సంస్థలు, ప్రజారోగ్య క్లినిక్ లు పెరుగుతున్నాయి. అకాడెమిక్ హోమియోపతి ఇన్స్టిట్యూట్స్ ఆయుష్ కాలేజీలలో 35.8%, హోమియోపతి ప్రాక్టీషనర్లు మొత్తం ఆయుష్ లో 37% ఉన్నారు.

మన దేశంలో హోమియోపతిలో అతిపెద్ద ఔషధ తయారీ మరియు వ్యాపార రంగంగా ఉంది. గొంతు నొప్పి, మైగ్రేన్లు, చెవి ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి తీవ్రమైన రోగాలను ఆర్థరైటిస్, ఆటిజం, డిప్రెషన్ మరియు ఉబ్బసం వంటి దీర్ఘకాలిక పరిస్థితులతో పరిష్కరించడానికి ఇది ఉపయోగ పడుతుందని చెపుతారు.

……………………………………….
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494
………………………………….

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments