Wednesday, November 30, 2022
HomeLifestyleLife styleవివక్షత నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం

వివక్షత నిర్మూలన ద్వారానే సామాజిక న్యాయం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించ బడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. పేద రికం, నిరుద్యోగం వంటి సమస్యల ను అధిగమించడానికి చేయవల సిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపు కోవాలన్న ప్రతిపాదనను 2007, నవంబరు 26న జరిగిన ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం, ఎ/ఆర్ఈఎస్/62/10 ద్వారా తీర్మానించగా 2009, ఫిబ్రవరి 20న తొలిసారిగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుప బడింది. ఐక్య రాజ్య సమితి, 2007 నవంబర్ 26నాటి సర్వ సభ్య సమావేశంలో ప్రధానంగా పేదరిక నిర్మూలన, అందరికీ పని, ప్రజలం దరి పూర్తి సమానత్వం, సంక్షేమ స్థాపన ప్రధానాంశాలుగా సమావేశం చర్చించింది. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని గుర్తించి పేదరికం, లింగ సమాన త్వం, నిరుద్యోగం, మానవ హక్కు లు, సామాజిక రక్షణ వంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం, అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధ వ్యాలు ఏర్పాటుచేయడం, సామర స్య వాతావరణం సాధించడం, వివిధ దేశాలమధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్ప డం; విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడడం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. ఫలితంగా ఆ సమావేశంలో మొదటిసారిగా సామాజిక న్యాయంకు సంబంధించి సూత్రాలను రూపొందించింది. అన్ని సభ్య దేశాలు ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. సామాజిక న్యాయం అనేది కేవలం నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు, అది జాతీయ స్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుకు ఆధారం. మానవుడు నాగరికతకు అలవాటు పడే అవకాశాలు కలిగిన నాటి నుండి సామాజిక న్యాయ పాలన గురించి కలలు కంటున్నాడు. ప్రజలంతా సమాన అవకాశాలు కలిగి ఉండడం వారి జన్మ హక్కు. అయితే అలాంటి హక్కును అధిక శాతం పొందలేక పోతున్నారు.ప్రపంచ జనాభాలో 80 శాతం మందికి సామాజిక భద్రత వర్తింపు లేదు. ముఖ్యంగా మహిళలను తమ శక్తి యుక్తులను వినియో గించుకుని, ఆర్థిక అభివృద్ధికి సమాన స్థాయిలో దోహద పడేం దుకు అనేక రూపాల్లో వున్న వివక్షత అవరోధంగా మారుతు న్నది. పర్యవసానంగా అధిక సంఖ్యలో స్త్రీ పురుషులు నిరుద్యో గులుగా ఉంటున్నారు. శ్రామిక జనాభాలో ఆశించిన స్థాయిలో శ్రమిస్తున్నప్పటికీ చాలీ చాలని ఆదాయం ద్వారా దారిద్య్ర రేఖకు ఎగువకు తమ కుటుంబాలను తీసుకెళ్ళలేక పోతున్నారు.అత్య ధిక సంఖ్యాకులైన యువ జన, స్త్రీ, పురుషులకు ఎలాంటి ఉపాధులు లేవు. నిరుద్యోగ వ్యవస్థ అసాధారణ స్థాయికి పెరిగి పోతు న్నది. యువత పని లేకుండా ఉంటూ అవాంఛిత అలవాట్లకు లోనై తమ బంగారు జీవితాలను బలి పెడుతున్నారు. సామాజిక న్యాయం మానవ హక్కులు మరియు సమానత్వం అనే భావనలపై ఆధారపడింది. సామాజిక న్యాయం సాధించాలంటే మానవ హక్కులను పరిరక్షించి, వాటికి విలువను ఇచ్చి, ప్రతి మనిషి గౌరవాన్ని గుర్తించి, సమాన త్వం మరియు ఐకమత్యం అనే సూత్రాల ఆధారంగా సాంఘిక సమానత్వ సమాజ స్థాపన జరగాలి. అన్ని రకాల మానవ దోపిడీ వ్యక్తీకరణలను అణచి వేయాలి. యువజన స్త్రీ పురుషుల ఉపాధి లేమితో పాటు నానాటికీ పెరిగిపోతున్న బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే చర్యలు గై కొనాలి. అలాగే బలవంతపు చాకిరీ, ఉపాధి లేమి, స్త్రీ పురుషులు మానవ అక్రమ రవాణా, దారి ద్య్రం, ఉచ్చులనుండి విముక్తి కలిగించాలి. ప్రతి పౌరునికి జీవనాధారం అంటే సముచిత ఉపాధి కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. పని ప్రదేశాల్లో మౌలిక హక్కులను పరిరక్షించాలి..సామాజిక న్యాయం సాకారం కావాలంటే… పేదరిక నిర్మూలనకు, ప్రజలకు పూర్తి ఉపాధి మరియు మంచి పనిని అందించడానికి, స్త్రీ పురుషులకు సమాన హక్కులను సాధించడానికి, అలాగే అందరికీ సామాజిక సంక్షేమం మరియు సామాజిక న్యాయాన్ని అందించ డానికి పాలక వర్గాలు కృషి సల్పాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments