లక్ష్యానికి దూరంగా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం

Date:

ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదన్న సూత్రము న్యాయ వయ్వస్థకు పునాది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, అనేది “అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం” అని కూడా పిలువ బడుతుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా జూలై 17 న జరుపుకుంటారు.

యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలపై విచారణ జరిపేందుకు ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మొట్టమొదటిసారి 1919లో జరిగిన పారిస్ శాంతి సదస్సులో కమిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తెరపైకి తీసుకొచ్చింది. లీగ్ ఆఫ్ నేషన్స్ ఆధ్వర్యంలో నవంబరు 1-16, 1937 మధ్య జెనీవాలో జరిగిన సదస్సులో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు.
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చోటుచేసుకున్న దురాగతాలపై విచారణ జరిపేందుకు ఒక శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని 1948లో మొదటిసారి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో గుర్తించారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత నాజీ యుద్ధ నేరాలపై దర్యాప్తు జరిపిన ఒక పరిశోధకుడు, న్యూరెంబర్గ్‌లో అమెరికా అధికారిక యంత్రాంగం జరిపిన పన్నెండు సైనిక విచారణల్లో ఒకటైన ఐన్‌శాట్జ్‌గ్రూపెన్ విచారణలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆర్మీ ప్రధాన న్యాయవాదిగా వ్యవహరించిన బెంజమిన్ బి. ఫెరెంజ్… ఒక అంతర్జాతీయ చట్ట పాలన, ఒక అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం ఏర్పాటుకు ప్రధాన మద్దతుదారుగా మారారు.
1975లో ప్రచురించిన ‘డిఫైనింగ్ ఇంటర్నేషనల్ అగ్రెషన్ – ది సెర్చ్ ఫర్ వరల్డ్ పీస్’ అనే తన మొదటి పుస్తకంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు కోసం వాదించారు. అలా

ఒక శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానాన్ని సృష్టించాలని ప్రతిపాదన రావడంతో, 1989లో ఈ ఆలోచనకు రూప కల్పన చేసేందుకు, ముసాయిదాను తయారు చేసేందుకు నడుం బిగించ బడింది. యుగోస్లావియా, రువాండాల్లో యుద్ధ నేరాలపై విచారణ జరిపేందుకు న్యాయస్థానాలు తొలుత ఏర్పడ్డాయి. దీంతో ఒక శాశ్వత అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం ఏర్పాటు అవసరం మరింత ప్రాధాన్యత పొందింది. ఇందుకు సంబంధించి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసే లక్ష్యంతో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ జూన్ 1998లో రోమ్ నగరంలో ఒక సదస్సును ఏర్పాటు చేసింది. 21 దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఒప్పందానికి చైనా, ఇరాక్, ఇజ్రాయెల్, లిబియా, ఖతర్, యునైటెడ్ స్టేట్స్, యెమెన్ ఏడు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. జూలై 17, 1998న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ స్థానం రోమ్ శాసనం, 120 – 7 ఓట్ల తేడాతో ఆమోదిం చబడింది. ఇదే రోజున అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఏప్రిల్ 11, 2002న రోమ్ శాసనం సభ్య దేశాల ఆమోదంతో ఒక బంధన ఒప్పందంగా మారింది. శాసనం న్యాయబద్ధంగా జులై 1, 2002 నుంచి అమల్లోకి వచ్చింది. ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) కు ఆ రోజు తరువాత జరిగిన నేరాలపై మాత్రమే విచారణ జరిపే అధికారాన్ని కల్పించారు. 18 మంది న్యాయమూర్తులతో కూడిన మొదటి ధర్మాసనాన్ని సభ్యదేశాల సభలో ఫిబ్రవరి 2003లో ఎన్నుకోవడం జరిగింది. ఈ న్యాయమూర్తులు మార్చి 1, 2003న న్యాయస్థాన ప్రారంభ సెషన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ పరిధి ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం లేదా ప్రపంచ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక న్యాయ అంగంగా నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన “న్యాయపర వాదనలు” ఆలకించడం, తీర్పు చెప్పడం. అయితే దీని యొక్క విచారణలు ఎక్కడైనా జరగవచ్చు. ఆగస్టు 2010 నాటికి, 113 దేశాలు న్యాయస్థానంలో సభ్య దేశాలయ్యాయి, దాదాపుగా అన్ని ఐరోపా మరియు దక్షిణ అమెరికా దేశాలు, ఆఫ్రికాలోని సగం దేశాలు ఇప్పుడు దీనిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారి, ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికి ఒక వ్యక్తికి నష్టపరిహారాన్ని మరో వ్యక్తి చెల్లించాలని ఆదేశించే అధికారాన్ని కల్పించారు. ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇటువంటి అధికారం కల్పించడం కూడా ఇదే మొదటిసారి.
కనీసం 139 దేశాల్లో అనుమానిత నేరాల గురించి న్యాయస్థానానికి ఫిర్యాదులు అందాయి.
న్యాయస్థానం ఐదు కేసులపై విచారణలు ప్రారంభించింది: ఉత్తర ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డార్ఫూర్ (సూడాన్) మరియు రిపబ్లిక్ ఆఫ్ కెన్యా కేసులపై ఈ న్యాయస్థానం విచారణలు చేపట్టింది. న్యాయస్థానం పదహారు మంది వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఏడుగురు పరారీలో ఉండగా, ఇద్దరు మరణించారు (లేదా మరణించినట్లు విశ్వసిస్తున్నారు), నలుగురు నిర్బంధంలో ఉన్నారు. ముగ్గురు స్వచ్ఛందంగా న్యాయస్థానం ఎదుట లొంగి పోయారు.2007 అక్టోబరు 4నాటికి కనీసం 139 దేశాల్లో అనుమానిత నేరాలకు సంబంధించి విచారణకర్తకు 2889 సమాచారాలు వచ్చాయి. అయితే ప్రాథమిక సమీక్ష తరువాత, ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులను న్యాయస్థానం యొక్క అధికార పరిధికి వెలుపల ఉన్న పరిస్థితులుగా గుర్తించి తోసిపుచ్చడం జరిగింది.
ఐసిసికి 123 సభ్య దేశాల మద్దతు ఉందని చెపుతున్నా, ఐసిసి ఒక న్యాయ వ్యవస్థగా రోమ్ స్టాచ్యూట్‌కు కట్టుబడి, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా పని చేస్తుందని ప్రకటిస్తున్నా, లక్ష్య సాధనకు బహుదూరంలో ఉంది. అమెరికా ఆంక్షల నీడలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) మీద కూడా పడడం, సభ్య దేశాల సహకార లోపం తదితర కారణాలతో ఆశించిన ఫలితం రావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...