5.1 C
New York
Saturday, June 3, 2023
HomeLifestyleLife styleలైంగిక వేధింపులపై చట్ట పర చర్యలు

లైంగిక వేధింపులపై చట్ట పర చర్యలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం వారి ప్రాథమిక హక్కులను హరించ డమే. ఆయా సందర్భాలలో మహి ళలు అన్యాయానికి, అసమానత లకు, గురవుతుండడం తరుచూ జరుగుతున్నదే. లింగసమానత్వం విషయంలో ఆశించిన స్థాయిలో సమాజంలో మార్పు రాకుండా ఉండడం చూస్తున్నదే. లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ పేరుతో జరిగే అనిష్టపూర్వక, ఆమోద యోగ్యం కాని లైంగిక ప్రవర్తనలు భారతదేశంలోనే కాక ప్రపంచ మంతటా అడ్డుకట్ట వేయలేక పోతుండడం పాత విషయమే. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నేరాల్లో అత్యధిక భాగం పురుషులు వల్ల మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలే. అయితే ఏ మహిళ గానీ, పురుషుడు గానీ తమ వ్యక్తిగత గౌరవానికి హోదాకూ భంగం కలిగించే అటువంటి ప్రవర్తననూ దానివల్ల వ్యక్తులకూ, సంస్థలకూ, సమాజానికి జరిగే హానికర ప్రభావాలనూ సహించ వలసిన అవసరం లేకుండా ప్రపంచ దేశాలు పకడ్బందీ చర్యలు గైకొంటున్నాయి. అలాంటి ప్రవర్తనా ధోరణిని అణిచివేయ వలసిన అవసరాన్ని గుర్తించి అనేక దేశాలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులని నిషేధిస్తూ, వాటికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన చర్యల్ని చేపట్టాయి. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరిగే లైంగిక వేధింపుల (నిరోధం, నివార ణ, పరిహారాలు) చట్టం, 2013 ను ఆమోదించడం ద్వారా భారతదేశం కూడ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలను బలోపేతం చేసింది.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం, 2013 అనేది భారత దేశంలో మహిళలకు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నించి రక్షణ కలిగించటానికి ఏర్పడ్డ చట్టం. ఇది 2012 సెప్టెంబరు 3న లోక్ సభ ఆమోదం పొందింది. తర్వాత రాజ్య సభలో 2013 ఫిబ్రవరి 26న ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టం 2013 డిసెంబరు 9న అమలులోకి వచ్చింది. మహిళల మీద పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. పని ప్రదేశాల్లోని లైంగిక వేధింపులకు వ్యతిరేకమైన ఫిర్యాదులకు పరిహా రం అందేలా చూస్తుంది. మతం, జాతి, కులం, లింగ భేదం, లేదా ఇతరముల ఆధారంగా జీవన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను అరికట్టడానికి వీలు లేదని రాజ్యాం గం స్పష్టం చేస్తున్నది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15 ప్రకారం లైంగిక వేధింపు అనేది స్త్రీ ప్రాథమిక సమాన హక్కులను ఉల్లంఘిస్తుంది. అంతేకాక ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, హుందాగా జీవించే హక్కు, ఏ వృత్తి, ఉద్యోగం, వాణిజ్యం లేదా వ్యాపారం అయినా చేపట్టే హక్కుల లో నే లైంగిక వేధింపులు లేని వాతా వరణంలో పని చేసే హక్కు కూడా ఉంది.

లైంగిక వేధింపులనేవి మహిళలకు సమాన అవకాశాలకూ సమానత్వ ప్రాతిపదికను పొందేందుకు అడ్డంకు అవుతాయదన్న కారణంగా భారత ప్రభుత్వం ప్రత్యేకించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో నిబద్ధతను కన పరిచాయి. అలాగే మార్గదర్శ కాలను లేబర్ కమీషనర్లకు, అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు మార్గదర్శక సూత్రాలను రూపొందిం చడం జరిగింది. పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల పట్ల జరిగే లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిహారాలు) చట్టం 2013, అమలులో భాగంగా, కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల్లోనూ, జిల్లా స్థాయిల్లోనూ, ఉద్యోగుల, పనివార ల, మహిళా సంస్థల్లోనూ ఉపయో గించేందుకు ఎప్పటికప్పుడు యీ చట్టం లోని మార్గదర్శక సూత్రాలను వర్తమాన పరిస్థితులకు అనుగుణం గా మెరుగుపర్చు కోవచ్చునని నిర్ణయించడం జరిగింది.

ఒకే చోట పనిచేస్తున్న సమయంలో మగ, ఆడవాళ్ల, మధ్య స్నేహ పూర్వక బంధాలు ఏర్పడటం సర్వ సాధారణం. అయితే కొన్ని సందర్భా లలో వారి మధ్య సంభాషణలు, ప్రవర్తనలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది. ఇద్దరికీ ఇబ్బంది లేనప్పుడు ఎలాంటి సమస్యా లేదు. పరస్పర అంగీకారం కొరవడి, మహిళ అభ్యంతరం చెప్పాక కూడా అవతలి వ్యక్తి అలానే వ్యవహరిస్తే అది లైంగిక వేధింపు కిందకే వస్తుంది.

వేధించే వ్యక్తి ఆఫీసులో తమకంటే పై స్థాయిలో ఉన్నవాడైతే, వాళ్లపై ఫిర్యాదులు తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. అందుకే వారు ధైర్యంగా ఫిర్యాదు చేయ లేకపోతున్నారు. ఒక్కో సందర్భం లో ఆ వ్యక్తి ఏదైనా చేస్తాడనే భయంతో కూడా మహిళ లు మౌనంగా ఉండిపోతున్నారు.
చట్ట ప్రకారం పది మందికన్నా ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి సంస్థా ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని ఏర్పాటు చేయాలి. దానికి ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నాయ కత్వం వహించాలి. అందులో సగానికి పైగా మహిళా సభ్యులుం డాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా అందులో సభ్యత్వం ఉండాలి.
పదిమందికంటే తక్కువ సిబ్బంది ఉన్న సంస్థల్లో ఎవరైనా మహిళా ఉద్యోగి వేధింపులకు గురైతే, జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేయాలి.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments