5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionఆధునిక శరీర ధర్మశాస్త్ర పితామహుడు విలియం హార్వే

ఆధునిక శరీర ధర్మశాస్త్ర పితామహుడు విలియం హార్వే

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతి గురించి చాలా కాలం క్రితమే పరిశోధించి, భావి వైద్యులకు అపూర్వ విజ్ఞానాన్ని అందించిన గొప్ప శాస్త్రవేత్త విలియం హార్వే.

మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్ర బద్ధంగా అందజేసిన ఘనత విల్లియం హార్వేకు దక్కుతుంది. శరీరం ద్వారా రక్త ప్రసరణను కనుగొన్న మొదటి పరిశోధకుడు. శరీరంలో రక్త ప్రసరణను సరిగ్గా వివరించి, విలియం హార్వే, ధమనులు మరియు సిరలు పూర్తి సర్క్యూట్ ను ఏర్పరుస్తాయని చూపించాడు. సర్క్యూట్ గుండె వద్ద మొదలై గుండెకు తిరిగి వెళుతుందని అపూర్వ పరిశోధనల ఫలితాలను రుజువు పరిచాడు.

మానవ శరీరంపై ఆసక్తి పెంచుకున్న హార్వే అనేక జంతువుల శరీర అంతర్భాగాలను క్షుణ్ణంగా పరిశీలించి గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థ కు సంబంధించి లోతుగా అధ్యయనం చేసిన క్రమంలో గుండె పనితీరు, రక్త ప్రసరణ విధానాలను గమనించాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్టు కోవడమే అని రుజువు చేశాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టు కుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.

విలియం హార్వే (ఏప్రిల్ 1, 1578 – జూన్ 3, 1657) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకు డయ్యాడు. నేడు హృదయం గురించి అందరికీ తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుండో చెప్పగలుగు తున్నారు. అదే 16 వ శతాబ్దం వరకు గుండె గురించి దేవునికి తప్ప మానవ మాత్రులకు ఏమీ తెలియదు అని భావించే వారు.

విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. పదిహేనవ యేట కేంబ్రిడ్జిలోని సైన్స్‌ కాలేజీలో చేరాడు. పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని పాడువా వైద్య విద్యాలయంలో చేరాడు. అక్కడ హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యరికం చేశాడు. 1602 లో వైద్య శాస్త్రంలో పట్టా పుచ్చు కొనటమే కాకుండా ప్రత్యేకమైన యోగ్యతా పత్రాన్ని పొంద గలిగాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లండ్‌ రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితు డయ్యాడు. అంతటి హోదాలో ఉన్న సంపన్నులు ఎవరైనా విలాసంగా జీవితం గడిపేస్తారేమో కానీ, విలియం హార్వే మాత్రం కొత్త విషయాలు తెలుసు కోడానికి పరిశోధకుడిగా మారాడు. గుండెకు సంబంధించిన సందేహాలు మాత్రం ఆయనను వదలలేదు. గుండె నుండి బయలు దేరిన రక్తం రక్త నాళాలలో అటూ ఇటూ ప్రవహించి చివరికి హరించుకు పోతుందే తప్ప మళ్లీ గుండెను చేరదు అనే వాదంలో నిజం ఉన్నట్లు హార్వేకు తోచలేదు. పెద్ద పెద్ద సిరలలో కవాటాలు ఎందుకు ఉంటాయనే తపన కూడా ఆయనలో బయలు దేరింది.

1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో ఆయన లెక్చరర్ గా నియమింప బడ్డాడు. చేపలు, కప్పలు, కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేయ సాగాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసు కున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్టు కోవడమే అని రుజువు చేశాడు. గుండెలో నాలుగు గదులు ఉంటాయని, ధమనుల ద్వారా గుండె లోని రక్తం బయటికి పంప్ చేయ బడుతుందని, సిరల ద్వారా కవాటాలు రక్తాన్ని గుండె వైపుకి వెళ్ళనిస్తాయే కాని గుండె లోంచి రక్తాన్ని వెలుపలికి రానివ్వవని తెలుసు కున్నాడు. ఒక అర గంటలో శరీరంలో ఉన్న మొత్తం రక్తం గుండె నుండి వెలువడే రక్తమే ఎక్కువగా ఉంటుందని నాడీ వేగం, గుండె స్పందించే రేటు ఆధారంగా నిర్ధారించుకో గలిగాడు.

చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయా కారంలో ప్రవహిస్తుందని తెలుసు కున్నాడు. రక్తం ప్రవహించే మార్గంలో వాల్వులు ఎలా పనిచేస్తాయో కనిపెట్టాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్ప గలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.

1628 లో, 50 సంవత్సరాల వయస్సులో, హార్వే తన పరిశోధనా ఫలితాలను ప్రచురించాడు – సాధారణంగా దీనిని డి మోటో కార్డిస్ – ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అని పిలుస్తారు. ఆంగ్లంలో అనాటమికల్ స్టడీస్ ఆన్…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments