Monday, August 15, 2022
HomeLifestyleLife styleమహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ, సామాజికం సహా అనేక రంగాల్లో మహిళల భాగ స్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఈ వేడుకలను జరుపుకుంటారు. అయితే వందేళ్లుగా, ఈ వేడుకలు జరుపుకుంటున్నా, నేటికీ మహిళ లు అనేక సమస్యల వలయలలో కొట్టు మిట్టా డుతునే ఉన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కార్మిక ఉద్యమం నేపద్యం ఉంది. 1908 సంవత్సరంలో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన ప్యాకేజీ, ఓటు హక్కు కోసం న్యూయార్క్ నగరంలో 15 వేల మంది మహిళలు భారీ ప్రదర్శన చేశారు. మహిళల ఈ డిమాండ్లకు సానుకూలమై, అమెరికాలోని సోషలిస్టు పార్టీ అధికారం లోకి వచ్చాక 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిం చాలన్న ప్రతిపాదన కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌’ సదస్సులో చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు ఏకగ్రీవంగా అంగీకరించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జ ర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించిన నేపథ్యం ఉంది. మహిళలు ఈ సమ్మెకు దిగిన దినం అప్పట్లో రష్యాలో అనుసరించే జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అత్య ధిక దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపు కొంటున్నారు.1975వ సంవత్సరం లోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించ టం ప్రారంభించింది. ఈ ఏడాది జరిగేది 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్: “సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం”… అయితే మహిళ లపై అణచివేతలు కొనసాగు తుండడం నిత్యకృత్యాలే అవుతు న్నాయి. రాజ్యాంగం ఎన్నో హక్కు లు కల్పించినా వాటిపై అవగాహన లేక పోవడంతో మరింత అన్యా యాలకు గురవు తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. తమపై వివక్షను, వేధింపులను ఎదుర్కో వడానికి వారు ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.

భారతీయ మహిళలందరికిని సమానత్వం( నిబంధన14), వివక్ష లేకుండుట (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం (నిబంధన16), సమాన పనికి సమాన వేతనం (నిబంధన 39(డి), వీటితో బాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధన లను అనుమతించడం (నిబంధన 15(3), మహిళల గౌరవానికి భంగం కల్గించే ఆచారాలను లేకుండా చేయడం(నిబంధన 51(ఎ) (ఇ), అంతేగాక మహిళలు చేసేపనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలో ఉపశ మనానికి (నిబంధన 42) మహిళా రిజర్వేషన్ 73వ రాజ్యంగా సవరణ ప్రకారం సదుపాయాలను అనుమ తించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది.

సెక్షన్ 100 ప్రకారం ఆత్మరక్షణ కోసం, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు. 166(బి) సెక్షన్ ప్రకారం.. బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స ఇవ్వకపోతే సంబంధిత సిబ్బంది, యాజ మాన్యం మీద కేసు వేయవచ్చు. 228(ఏ) సెక్షన్ ద్వారా లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించ కూడదు. అలా చేసిన పక్షంలో సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు. 354 సెక్షన్ ప్రకారం – స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమాన పర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయ వచ్చు. 376 సెక్షన్ కింద18 ఏళ్ల లోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే అది చట్టరీత్యా వ్యతిరేకం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా పురుషుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. 376 సెక్షన్ కింద వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగిక వేధింపు లకు గురిచేస్తే వారిపై చర్య తీసుకు నేందుకు సెక్షన్ ఉపయోగ పడు తూ, ఈ సెక్షన్ కింద కేసు చేస్తే రెండు నెలల్లో విచారణ చేసి తీర్పు ఇవ్వాలి. భార్య ఉండగా.. మరో పెళ్లి చేసుకుంటే 494 సెక్షన్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయవచ్చు. కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 498(ఏ) సెక్షన్- ఓ వివాహితను ఆమె భర్త కానీ, భర్త బంధువులు కానీ శారీర కంగా, మానసికంగా, హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహిం చినా ఈ సెక్షన్ కింద కేసు వేయ వచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించ బడుతుంది. 509 సెక్షన్ – మహిళ లతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువు లను ప్రదర్శించినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ 294 ప్రకారం వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష, లేదా కొంత జరిమానా వేయవచ్చు. ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై సెక్షన్ 354(డీ) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. పనిచేసే ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు గానీ, బాస్ గానీ ఆఫీసు పనుల్లో అలుసుగా తీసుకొని సెక్సువల్ కాంటాక్ట్ కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయ వచ్చు. ఒకరి ఫొటోను మార్ఫింగ్ చేసి వారి శరీరాలకు ముఖాన్ని అతికించి ఇబ్బంది కరంగా ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్న సంఘటనలలో సెక్షన్ 499 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడవచ్చు. ఒక మహిళను దౌర్జన్యంగా, బల ప్రయోగం వల్ల తన శరీరంపై ఉన్న దుస్తులను తీసివేసినా, ఆ వ్యక్తికి సెక్షన్ 354(బీ) ప్రకారం 3నుండి7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. 13/2013 సవరణల చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చబడింది. ఒక మహిళ, విద్యార్థినికి సంబం ధించిన రహస్య వ్యక్తిగత ఫొటోలు తీయడం, వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా 354(సీ) సెక్షన్ కింద ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. వ్యభిచారానికి, 18 ఏళ్లలోపు బాలికను కొనుగోలు చేసినా సెక్షన్ 373 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా విధిస్తారు. బాలికను వ్యభిచారానికి మారేందుకు ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా సెక్షన్ 366(ఏ) కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించ బడుతుంది. నిండు గర్భిణిని చంపాలనే ఉద్దేశంతో చేపట్టిన ఒక చర్య పర్యవసానంగా ఆమె చనిపోతే నేరస్థుడిపై సెక్షన్ 316 ప్రకారం ప్రాణహరణం కింద, నేరం మోప బడుతుంది. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు మరణిస్తే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ఒక బృందంలోని సభ్యులు ఒక మహిళపై లైంగిక దాడి చేసిన సందర్భాల్లోనూ వారిలో ప్రతి వ్యక్తి నేరానికి పాల్పడి నట్లే పరిగణించ బడుతుంది. సెక్షన్ 376-బీ కింద ప్రతి ఒక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధిస్తారు. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించబడింది.

స్త్రీ, బాలికను గానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తిని వివాహం చేసుకునేందుకు బలవంతంగా అంగీకరించాలని ఒత్తిడి తేవడం, ఆ స్త్రీని అపహరిస్తే బలవంతంగా వివాహం చేసుకునే సెక్షన్ 366 కింద పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది. ఇలాంటి చట్టాల ఎన్నో గురించి మహిళలు అవగాహన కలిగి ఉండాలి. అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్త్రీల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. సాటి మనుషులుగా మహిళలకు సామాజిక బాధ్యతగా సహకరించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments