రెండు తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 15 నుండి 30 వరకు థియేటర్ అక్యూపెన్సీని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతానికి తగ్గించాయి.దీంతో మెగాస్టార్ ఆచార్య,బన్నీ పుష్ప,ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు వాటి విడుదులను వాయిదా వేసుకున్నాయి.
ఇక నాని నటించిన టక్ జగదీష్ ముందు అనౌన్స్ చేసిన డేట్ ను వాయిదా వేసుకొని మే 1వ తేదీన రావడానికి రెడీ అవుతున్నారు.ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టొరీ మూవీ కూడా తమ డేట్ ను మే 13కు మార్చుకుంది.తాజాగా రానా నటించిన విరాట్ పర్వం మూవీ కూడా ప్రస్తుతానికి తమ సినిమాను వాయిదా వేసుకుంటునట్లు ప్రకటించింది.