ఈరోజు టాలీవుడ్ చిత్రాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ను వరస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నాయి.తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రానా దగ్గుబాటి,సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం చిత్రం రిలీజ్ డేట్ ను ఈరోజు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి,నందిత దాస్,నవీన్ చంద్ర,జరీనా వాహబ్ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం 5:04pm నిముషాలకు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.