యంగ్ హీరో విజయ దేవరకొండ క్రేజ్ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.అందుకే ప్రస్తుతం విజయ్ దేవరకొండ బాలీవుడ్ పై తన దృష్టిని సారించారు.తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో సాధించిన ఓ ఘనత ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తూ బాగా బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా 12 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటాడు.దీంతో సౌత్ ఇండియాలో ఈ మార్క్ దాటిన తొలి యాక్టర్ గా విజయ్ రికార్డ్ ను సాధించాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ మూవీ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల అవ్వాల్సివుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ డేట్ వాయిదా పడేలా ఉంది.