5.1 C
New York
Sunday, May 28, 2023
HomeNewsవిక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ!

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

సినీ హీరో వెంకటేష్ ని తొలి నుండి అభిమానించే విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన అప్పారావు అనే అభిమాని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని అప్పారావుకి కుటుంబ సమస్యలు కూడా బోలెడన్ని. దానికి ఈ ఆరోగ్య సమస్య తోడై చాలా ఇబ్బందుల్లో వున్నాడు. సాటి అభిమాని సమస్యని అర్థం చేసుకున్న రాష్ట్ర వెంకటేష్ ఫాన్స్ కరస్పాండెంట్ పి.చందు.. తనతో నిత్యం కాంటాక్ట్ లో ఉన్న అభిమానుల సాయంతో 62,000/- రూపాయలతోపాటు నెలరోజులకి సరిపడే నిత్యావసర వస్తువులు,బట్టలు, మందులు ఆ అభిమాని కుటుంబానికి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి సన్నిధిలో అందజేశారు.
ఈ సందర్భంగా అప్పారావు కుటుంబ సభ్యులు… ఇంత గొప్ప సాయాన్ని అందించిన అభిమానులందరికి జీవితాంతం మా కుటుంబం ఋణపడివుంటుందన్నారు.
2019లో కర్నూల్ లో చనిపోయిన ఇజ్రాయిల్ కుటుంబానికి 50,000 రూపాయాలు ఆల్ ఇండియా వెంకటేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో అందజేసామని..మళ్ళీ ఇప్పుడు అప్పారావు కుటుంబానికి 62,000 రూపాయల మొత్తాన్ని అందజేసామని, ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వెంకటేష్ అభిమానులు పెద్ద మొత్తంలో సేకరించి పంపి తమ సేవా నిరతిని చాటుకున్నారని…మిగతా ఏరియా అభిమానులు సైతం అద్భుతమైన స్పందనని తెలియజేశారని… వారందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అభిమానసంఘాల సమన్వయ కర్త చందు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జి శంకర్, పిల్లి శ్రీను, విజయనగరం వాసు, రమెష్, గాజువాక శివకుమార్, రాంబాబు, శరత్, లాయర్ శ్రీను, సతీష్,సోమేశ్, రాము, శ్రీను, దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు!!

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments