Saturday, November 26, 2022
Homespecial Editionకలియుగ దైవానికి ప్రత్యేక పూజలు

కలియుగ దైవానికి ప్రత్యేక పూజలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండిప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలోని ప్రధానాలయమైన శ్రీవేంకటేశ్వర ఆలయంలో శుక్ర వారం స్వామి వారి ఏకాంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్షీరోద సంభవాం… పాలసముద్రంలో జన్మించిన లక్ష్మీదేవి ప్రీతిపాత్రుడై క్షీరాబ్దిపై శయనించిన వైకుంఠ వాసునికి లక్ష్మీదేవి జన్మస్థానమైన క్షీరమంటే అత్యంత ఇష్టము. అందుకే మహావిష్ణువు క్షీరాభిషే కానికి సంతుష్టుడై, సకల కోర్కెలు నెర వేరుస్తాడని ప్రతీతి. “కృతేతునార సింహాభూత్ త్రేతాయం రఘునందన.., ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వేంకట నాయకః” కృతయుగంలో శ్రీనృసింహునిగా, త్రేతా యుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, కలి యుగంలో శ్రీవేంక టనాయ కునిగా అవతరించాడు శ్రీమహా విష్ణువు, శ్రీయాధ్య స్థిత వక్షసం… లక్ష్మీదేవి నివాస స్థానమైన వక్షము గల శ్రీవేంకటేశ్వరునికి, క్షీరాభిషేకం సర్వ శ్రేష్టం అలాగే స్వామి వారికి ప్రీతిపాత్ర ము. తనకిష్టమైన దానిని సమర్పించేవారి కి ఇష్టమైనవి ఇచ్చే వరదుడు అయిన శ్రీవేంకటేశ్వరుని ఏకాంతోత్సవ సందర్భంగా నిర్వహిం చే క్షీరాభిషేకం విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నది. శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అనుబంధ వేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాల అంతర్భాగంగా శుక్ర వారం నిర్వహించిన స్వామి ఏకాంతోత్సవ సందర్భంగా మును ముందుగా దేవాలయాన్ని, అర్చకు లు సకల పాప పరిహారార్థం సంప్రోక్ష కార్యక్రమాలు లక్ష్మీ హవనాది పూజలొ నరించారు. అనంతరం ఉప ప్రధానార్చకులు శ్రీనివాసా చార్య, శ్రీదరాచార్య, కిరణ్, మోహనాచార్య అర్చకులు, భక్తజన సమక్షంలో వేంకటేశ్వరుని మూల విరాట్టును ముందుగా పాలతో అభిషేకించి, సర్వాంగ సుంద రంగా అలంకరించి, ప్రత్యేక అర్చనలు గావించారు. అనంతరం ఏక, త్రయ, చమ, సప్త, సర్ప, నక్షత్ర, వృక్ష, కుంభాది హారతులు, మంత్రపుష్ప, అవధారయ, ఆశీర్వచనాది కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజాదికాలలో భాగస్వాము లైనారు. దేవస్థానం ఈఓ శ్రీని వాస్, అభివృద్ది కమిటీ బాధ్యులు, సిబ్బంది సౌకర్యాలను పర్యవే క్షించగా, భక్తులు పాల్గొన్నారు.

క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

పవిత్ర గోదావరి నదీ తీరస్థ పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం శుక్రవారం భక్తి పారశ్యంతో పొంగి పోయింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాల సందర్భంగా నిర్వహించిన కోరిన కోర్కెలు తీర్చే వరదుడైన శ్రీవేంకటేశ్వరుని ఏకాంతోత్సవ వేడుకలలో పాల్గొన్న, దీక్షలు స్వీకరించిన హన్మాన్ భక్తుల రాకతో క్షేత్రం భక్త, యాత్రిక జనంతో నిండి పోయింది. సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ సాంప్ర దాయాచరణలో భాగంగా విచ్చేసిన భక్త, యాత్రికజనం భగవన్నామ స్మరణలతో, జయ జయధ్వనాలతో క్షేత్రం ప్రతిధ్వ నించింది. వేంకటేశ్వ రాలయంలో ప్రత్యేక పూజాది కాలలో అధిక సంఖ్యాకులైన భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా అర్ధ మండల దీక్షాపరులైన హన్మాన్ భక్తుల భక్తి పారవశ్యం ఆవధులు దాటి అలౌకిక ఆనందాన్ని ఆస్వా దింప జేసింది. ఉదయాత్పూర్వం నుండే దూర ప్రాంతాలనుండి ప్రయివేటు వాహనాలు, బస్సులలో క్షేత్రానికి చేరుకున్న భక్తులు, పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించి, ప్రధానాలయాల ముందు బారులు తీరి వేచి ఉండి దైవ దర్శనాలు చేసు కున్నారు. విశేషించి దేవస్థానం లోని ప్రస న్నాంజనేయ మందిర ప్రాంగణా న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో ఆలయ అర్చకులు ఒద్దిపర్తి నర్సింహమూర్తి ఆధ్వర్యంలో హన్మాన్ భక్తులు మాల ధారణం, మంత్రోపదేశం పొందారు.

ఆంజనేయ సన్నిధిలోభక్తజనం

దీక్షాపరులైన భక్తులతో ఆంజనేయ ఆలయం కిటకిటలాడింది. ఇటీవలి కాలంలో ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానం లో సాంప్రదాయ రీతిలో హన్మాన్ దీక్షలను స్వీకరిస్తున్న నేపథ్యంలో, చైత్ర పౌర్ణమి హన్మాన్ జయంతిని పురస్క రించుకుని, 21రోజుల పాటు ఆచరించే దీక్షలలో భాగంగా, శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రత్యేక హన్మాన్ అర్ధ మండల దీక్షలను స్వీకరించేందుకై అరుదెంచి, పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానా లను ఆచరించి, పునీతులై, శ్రీలక్ష్మీ నరసింహ దేవ స్థానాంతర్గత ప్రసన్నాంజనేయ ఆలయం ముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉన్నారు. దేవ స్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయ అర్చకులు వొద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో అంజనీ తనయునికి ప్రత్యేక అభిషేకాలు, నిత్యవిధి పూజలు, అర్చనలు నిర్వహించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments