భారత సాయుధ తిరుగుబాటు పితామహుడు ఫడ్కే

Date:

వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే… దేశంలో చాలా మందికి తెలియని, విని ఉండని పేరు. ఆ త్యాగ ధనుని గురించి చరిత్ర పుస్తకాలలో కూడా ఎక్కడా కనిపించదు. భారత దేశంలో సాయుధ తిరుగుబాటుకు బీజం వేసిన వ్యక్తి ఆయనే అని, తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఆ ఉద్యమ కారుని మీదే అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఆంగ్లేయుల దురాగతాలను ఎదిరించి, శ్వేత జాతీయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బల ప్రయోగం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుండి తరిమి వేయాలని తీర్మానించి, అమలులో ప్రాణాలు అర్పించిన వీర యోధు డు. శక్తివంత మైన బ్రిటిష్ సామ్రా జ్యాన్ని ఒంటిచేత్తో ఎదిరించి, సాయుధ తిరుగు బాటును రేకెత్తిం చి, భారత్‌లో బ్రిటిష్ అధికారాన్ని నాశనం చేసి హిందూ రాజ్యాన్ని పునః స్థాపిస్తా నని ప్రతిజ్ఞ చేసిన మేరు నగ ధీరుడు. 1879 అక్టోబర్ 22న ఆంగ్ల ప్రభుత్వం మొదటి రాజద్రోహ నేరం మోపబడింది ఈ వీరుడి పైనే కావడం గమనార్హం. వాసుదేవ బల్వంత ఫడ్కే (4 నవం బర్ 1845 – 17 ఫిబ్రవరి 1883) బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు. ఫడ్కే 1845 నవంబర్ 4న ప్రస్తుతం మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న పన్వెల్ తాలూకాలోని షిర్ధోన్ గ్రామంలో మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ రైతుకుటుంబంలో కుటుంబంలో జన్మించిన వాసుదేవ్, ప్రాథమిక విద్య తన గ్రామమైన షిర్డోన్ లోనే పూర్తి చేశాడు. హైస్కూల్ విద్యకు పూనాకు వెళ్ళగా ఆంగ్లేయులకు వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడు తున్నాడని 9 వ తరగతి లో బడి నుండి బయటకు పంపారు. పుణే నగరం చేరుకుని మిలటరీ అక్కౌంట్స్ డిపార్టుమెంటులో గుమాస్తాగా 15 సంవత్సరాల పాటు పని చేశాడు. సొంత గడ్డపై వ్యవసాయం చేస్తూ, రైతులపై అధిక పన్నులు విధిస్తున్న ఆంగ్లేయు లకు ఎదురు తిరిగాడు. వలస పాలన నుండి భారత స్వాతంత్ర్యం పొందే లక్ష్యంతో కోలి, బిల్లు, దంగర్ ఆదిగా సుమారు 300 మంది ఆదివాసీ యువకుల సహాయంతో ‘రామోషి’ అనే విప్లవ తిరుగుబాటు బృందాన్ని రూపొందించి, వారికి యుద్ధ విద్యలపై శిక్షణ నిర్వహిం చాడు. వాసుదేవ్ మొదట ప్రభుత్వ ఖజా నాలపై దాడి చేయడం మొదలు పెట్టాడు. అలా కొల్లగొట్టిన డబ్బును రైతులకు, ఆదివాసీలకు పంచే వాడు. ఆయుధాలు సమకూర్చు కొనేవాడు. బ్రిటీష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల వల్ల ఏకంగా పుణె నగరం పైనే ఫడ్కే పట్టు సాధించి, పూనాలో బలవంతు డైన తిరుగుబాటు నాయకుడైనాడు. దానితో ఆంగ్లే యులు పెద్దసైన్యం పంపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో అనేక దాడులను నిర్వహించడానికి వాసుదేవ బల్వంత ఫడ్కే ప్రణాళికలు రచించినా పరిమిత విజయాన్నే అందించాయి. ఒకసారి ఘనూరు గ్రామంలో సైన్యంతో నేరుగా తలప డ్డాడు. వాసుదేవ్ ను పట్టుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం బహుమానం ప్రకటిస్తే… బొంబాయి గవర్నర్‌ను పట్టుకున్నందుకు ఫడ్కే ఎదురు బహుమానం ప్రకటించాడు. ప్రతి యూరోపియన్‌ని చంపినందుకు బహుమతిని ప్రకటించాడు. కొన్ని రోజులు పూనాను వదిలి హైదరాబాద్ కు వచ్చాడు. అప్పుడు హైదరాబాద్ పై రోహిల్లాల తిరుగు బాటు జరుగుతున్నది. వాసుదేవ్ వారితో జత కట్టి నిజాంపై తిరుగుబాటు చేసాడు. రోహిల్లా లతో పాటు అరబ్బులు కూడా ఆయనతో చేతులు కలపారు. కాని ఆంగ్లేయుల గూఢ చారులు వాసుదేవ్ ఆచూకీ తెలుసు కున్నారు. బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్ నిజాం పోలీసు కమిషనర్ అబ్దుల్ హక్ తదతరులు అవిశ్రాంతంగా ఆయన అచూకి కోసం వెతికారు. 20 జూలై 1879న పండార్‌పూర్ వెళ్తున్న ప్పుడు కలడ్గి జిల్లాలో జరిగిన తీవ్రమైన పోరాటంలో వాసుదేవ్ ను ఒక దేవాలయంలో బంధించారు. ఫడ్కేని విచారణ నిమిత్తం పూణేకు తీసుకెళ్లారు. సర్వజనిక్ కాకా అని పిలువబడే గణేష్ వాసుదేవ్ జోషి ఆయన కేసును వాదించాడు. ఫడ్కేకి జీవిత ఖైదు విధించారు. ఆయన భారత్‌లో ఉంటే ప్రమాద కరమని గ్రహించి, జీవితాంతం ఏడెన్‌లోని జైలుకు తరలించారు. అతనికి సంకెళ్లు వేసి ఏకాంత నిర్బంధంలో ఉంచారు. అక్కడ 13 ఫిబ్రవరి 1883న జైలు నుండి అతను తప్పించుకున్నా మళ్ళీ వెంటనే తిరిగి స్వాధీనం చేసు కున్నారు బ్రిటీష్ పోలీసులు. అప్పటి నుంచి నిరహార దీక్ష చేస్తూ 17 ఫిబ్రవరి 1883న వాసుదేవ బల్వంత ఫడ్కే తుది శ్వాస విడిచాడు.ఫడ్కే భారత సాయుధ తిరుగు బాటు పితామహుడిగా పేరు పొందాడు. స్వతంత్ర ఉద్యమంలో సహ సభ్యులకు స్ఫూర్తిని అందించాడు. ఈ సమయంలో ఆయన కార్య కలాపాలను బంకిం చంద్ర చటో పాధ్యాయ్ రచించిన దేశభక్తి నవల ఆనంద్ మఠ్ లో పొందు పరిచారు. కానీ అప్పటి బ్రిటీష్ వలస ప్రభుత్వం దీన్ని ఆమోదించ లేదు. అందుకని ఈ అంశాలు తొలగించి పుస్తకాన్ని కుదించి ముద్రించాల్సి వచ్చింది. 1984 లో, భారతీయ పోస్టల్ సర్వీస్ ఫడ్కే గౌరవార్థం 50 పైసల స్టాంపును విడుదల చేసింది. ఆయన గౌరవార్థం దక్షిణ ముంబై లోని మెట్రో సినిమా సమీపంలో ఒక చౌక్ పేరు పెట్టారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...