ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో గోపి చంద్ మారుతి తో ఓ చిత్రం చేయనున్నారు.దీనికి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రం టైటిల్ ను రేపు ఉదయం 8:30 కు అనౌన్స్ చేయనున్నారు.దానికి సంబంధించిన ఓ పోస్టర్ ను గీతా ఆర్ట్స్ తమ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
హిట్ కోసం పరితపిస్తున్న మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్ కు ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ హిట్ ను ఇచ్చిన మారుతి.గోపీచంద్ కు కూడా అలాంటి హిట్ నే ఇస్తారా లేదో వేచి చూడాలి.పక్క కమర్షియల్ సినిమాగా తెరకెక్కి ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.కానీ ప్రస్తుతం ఉన్న కొన్ని ఊహాగానాల ప్రకారం ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతికి ఇది నాలువ చిత్రం.