Thursday, October 6, 2022
Homespecial Editionనాటక రంగానికి సర్వస్వం ధార వోసిన వనారస గోవిందరావు

నాటక రంగానికి సర్వస్వం ధార వోసిన వనారస గోవిందరావు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


తెలుగు నాటకరంగ ఘనత ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే దిశగా అనేక మంది నటులు నాటకాలను ప్రదర్శించారు, నాటక సంస్థలను పోషించారు. అయితే పలు నాటక సంస్థలను స్థాపించి, కుటుంబాల సహితంగా ప్రదర్శనలు ఇచ్చి, నటులను ప్రోత్సహించి, ఇప్పటికీ నాటకాలకు ఆదరణ కొనసాగ డానికి కారణ భూతులై, నాటకాలే జీవిత పరమార్థం గా భావించి, అందుకు కృషి సల్పిన వనారస గోవిందరావుకు అకుంఠిత దీక్ష, అంకిత భావం కారణం. మనో వినోదిని, సురభి, ఆంధ్ర నాటక పరిషత్తు సంస్థలను స్థాపించి, ఆంధ్ర నాటక కళో ద్దారక బిరుదు నొంది, నాటక రంగ పితామహునిగా చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోయారు గోవింద రావు.


గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతు లకు జన్మించారు. ఆయన పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిం దప్ప. అదే గోవిందరావుగా మారింది.

వెంకప్ప, గోవిందప్పకు, సంగీత, గాత్ర, పాట ఫిడేలు వాయించుట నేర్పుతు, చెన్నపురి, బొంబాయి, హైదరాబాదు మొదలగు పట్టణ ములకు తీసుకొనిపోయి నాటక ములను చూపించే వాడు. చెన్న పురిలో అరవ నాటకములు, సారంగధర, వస్త్రాప హరణం, భువనేంద్ర సభ చూశారు. ఒక రోజున ఎవరికి చెప్పక నంద్యాల పారిపోయి, తాను తల్లిదండ్రులు లేని వాడననియు బీడవాడనియు జెప్పి అక్కడ జ్యోతి సుబ్బయ్యగారి నాటక సంఘములో పని చేయుటకు చేరాడు. వారి దగ్గిర పాటలు తదితరాలు చాటుగా నేర్చుకొని, హరిశ్చంద్రలో విశ్వామిత్రుని పాత్ర నేర్చుకొని వేశాడు.


సురభి గ్రామంలో కీచక వధ ప్రదర్శిస్తే, అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. 1895 లో సురభి గ్రామంలో రామి రెడ్డి చెన్నా రెడ్డి యింట్లో వివాహములు సంధర్భంగా, వీధి నాటకం ఆడేందుకు, తన వారికి నేర్పించి తాను సేకరించిన పాటలు నేర్పి తెచ్చిన పరికరముల నుపయో గించి, చెన్నా రెడ్డి ఇంట్లోని చీరలు, దుస్తులు నగల సహా యముతో కీచక వధ ప్రదర్శించారు. తరువాత ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభిం చారు. ఆ సభే సురభి కంపెనీలకు మాతృసంస్థ.

ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. కాగా వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్న రామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభిరెడ్డివారి పల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారం భించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణా సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి చెందినది.

రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందం ఏదంటే అది కేవలం సురభి నాటక సమాజమే. స్త్రీలు నాట కాలలో నటించ కూడదని అంటున్న కాలంలో తన భార్యా బిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.

నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యుల వడం చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. నాటక కళనే వృత్తిగా పెట్టుకొని జీవింప వాంఛగల ఇతర కుటుంబ ముల, తమలో చేర్చుకొన్నారు.

బృందములోని సభ్యులకు రంగ స్థలమే జీవితముగా సాగేది. ఊరూరూ తిరుగుతూ…పల్లె పల్లెనా నాటకాలతో జనాలను రంజింప జేసేవారు.విశ్వామిత్రుడు, నకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు తదితర విభిన్న పాత్రలు పోషించారు.


ఇలా 6సంపత్సరములు ఆంధ్ర దేశము, నైజాం, బర్మా తదితర ప్రాంతాల్లో సంచార మొసర్చి, కుటుంబములు ఎక్కువ అయినందున, సదరు కుటుంబాల అన్నదమ్ములు వేరు వేరు సంఘా లను ఏర్పాటు చేసుకున్నారు.

1908 వ సంవత్సరమునుండి 16 సంవత్సరములు గోవింద రావు ఇతరుల సహాయము లేక తన భార్య పిల్లలతోకనే స్వయముగా సంఘమును అభివృద్ధికి తెచ్చారు. తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారా నికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు.

1917లో భీమవరంలో లంకా దహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని శరీరం కాలింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ నాటక సమాజాన్ని అయన వదిలి పెట్ట లేదు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించే వారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింప బడును’ అని అచ్చు వేసేవారంటే అయన నటన ఎంత గొప్ప పేరు పొందిందో అర్థం అవుతుంది.

1929నాటికే ఆంధ్రదేశంలో నాటక కళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి దానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.

సురభి’ నాటక కంపెనీ పితా మహుడుగా అప్పటికే పేరొందిన వనారస గోవిందరావు ఆరు నెలల పాటు కష్టపడి, రాష్ట్రంలోని ప్రము ఖులను కూడగట్టి, ఎంతో వ్యయాని కి ఓర్చి, ‘ఆంధ్ర నాటక కళా పరిషత్‌’ ఆవిర్భావానికి దోహద పడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్‌ 19, 20, 21 తేదీల్లో తెనాలి లో వైభవంగా నిర్వహించారు.

జీవిత చరమాంకంలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని దానధర్మాలు చేశారు. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలారులో ప్రతిష్ఠిం చారు.జీవితాన్ని నాటక రంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన వనారస 1953, డిసెంబర్ 19న మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments