కోనసీమ తిరుపతి’ గా..’ఏడు వారాల వెంకన్న’ గా ఖ్యాతిగాంచిన తూర్పుగోదావరి జిల్లా, వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థ మహోత్సవాలు ఏటా ఘనంగా జరుగుతాయి. ఏప్రిల్ 11నుండి 17 వరకు నిర్వహించే వార్షిక తీర్థ మహోత్సవాలలో భాగంగా ఈ నెల 12న మధ్యాహ్నం రథోత్సవ, రాత్రి కళ్యాణోత్సవాలకు దేవస్థానం ముస్తాబు అయింది. 15వ తేదీన తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో వాడపల్లి గ్రామం, , గోదావరి నది ఒడ్డున ఉంది. ప్రసిద్ధి చెందిన వాడపల్లి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు.
ఇక్కడి వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాడపల్లి వెంకన్న స్వామి దేవాలయం అని కూడా అంటారు. గౌతమీ తీరంలో కొలువున్న ఈ స్వామిని దేవర్షి నారదుడే ప్రతిష్ఠింప చేశాడంటారు. పురాతన చరిత్రగల ఆలయాలలో ఇది ఒకటి. వెంకటేశ్వర స్వామి దేవత ఎర్రచందనం చెక్కతో చేయబడింది. వాడపల్లి వెంకన్న దేవాలయం రావులపాలెం నుండి 10 కి.మీ. శ్రీ వేంకటేశ్వర స్వామిని కల్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు.
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి స్వయంభు క్షేత్రం. వాడపల్లి
క్షేత్రం రాజమండ్రి ( రాజమహేంద్రవరం ) కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌతమీ నదీ తీరాన వెలసిన స్వామిని భక్తులు తమ పాలిట కొంగు బంగారంలా విశ్వసిస్తారు. ఇది ఒక చారిత్రాత్మక దేవాలయం, తరువాత విశాలమైన ప్రదేశంలో అభివృద్ధి చేయబడింది. ఈ క్షేత్రం లో ఏడు శనివారాలు దర్శించుకుని, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిశనివారం ఇక్కడకు భక్తులకు వేలాదిగా తరలివస్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు.
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని ఏడు కొండల స్వామిని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి.
ఈ నెల 11సోమవారం నుండి 17 ఆదివారం వరకు
నిర్వహించే వార్షిక తీర్థ మహోత్సవాలలో భాగంగా చైత్ర శుద్ధ ఏకాదశి మంగళవారం 12వ తేదీన మధ్యాహ్నం 2.15లకు రథోత్సవం, రాత్రి 7గంటలకు కల్యాణోత్సవం జరిపిస్తారు. 15న చతుర్దశి శుక్రవారం రాత్రి 7గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడపల్లికి బస్సులు, ఆటోలు మొదలైన వాటి ద్వారా చేరుకోవచ్చు. ఆలయం 6 నుండి 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి 7 వరకు తెరిచి ఉంటుంది. ఆలయం వద్ద యాత్రికుల కోసం ప్రతిరోజూ మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం చేస్తారు. ప్రధాన ఆలయం పక్కన, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి (శివ) దేవాలయం ఇక్కడ ఉంది. ఆలయానికి ఎదురుగా గరుడ, గజ మరియు అనేక ఇతర స్వామి వాహనాలను మనం చూడవచ్చు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494