5.1 C
New York
Saturday, June 3, 2023
Homespecial Editionఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి 7వ నిజాం

ఆధునిక హైదరాబాద్ వాస్తు శిల్పి 7వ నిజాం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మీర్ ఉస్మాన్ అలీఖాన్…భాగ్యనగరంలో విడదీయరాని బంధం, సంబంధం, అనుబంధం ఉన్న పాలకుడు. కొందరు ఆయనను ద్వేషించినా, మరి కొందరు ప్రేమించినా, ఆయన హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని అందరూ అభినందించక తప్పదు. కొందరు ఆయన్ను సంకుచిత మనస్తత్వం గలిగిన, కొందరు మతతత్వం గలిగిన పాలకునిగా, మరికొందరు అతన్ని దుర్మార్గుడు అని భావించినా, ఆధునిక హైదరాబాద్ వాస్తుశిల్పిగా, నిర్మాతగా ఆయన జ్ఞాపకం ఉండక మానడు. ప్రణాళికా బద్ధమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో తన దృష్టిని అమోఘం. కృషి అనన్య సామాన్యం. హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కట్టెదుట కనిపించే ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ కాదన లేని వాస్తవం.

ఉస్మాన్ ఆలీ ఖాన్ (ఏప్రిల్ 6, 1886 – ఫిబ్రవరి 24, 1967) మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. పూర్తి పేరు ” ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా. టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాంను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.1947 ఆగస్టు 15న భారత దేశం స్వాతంత్ర్యం పొందిన అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించగా, నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు. ఆయన 1967 సంవత్సర ఫిబ్రవరి 24 తేదీన మరణించాడు.

జమిందార్లు, చిన్న గడీదారులు, దొరలు, తాబేదారులు, నిజాం నవాబుకు కప్పం చెలించే వారు కప్పం ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో కట్టడాలు నిజాం నవాబులు నిర్మించారు. అలా నిర్మించిన వాటిల్లో పేర్కొన తగినవి…
చిరాన్ ప్యాలెస్… హైదరాబాదు లోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలో 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.
తెలంగాణ హైకోర్టు…1920, ఏప్రిల్ 20న తెలంగాణ హైకోర్టు ప్రారంభించ బడింది.
రాజ్‌భవన్… సోమాజీగూడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం ఈ రాజ్‌భవన్. ఇది రాష్ట్ర గవర్నరు అధికారిక నివాసంగా ఉపయోగ పడుతుంది. ఆజా ఖానా ఎ జెహ్రా… మూసీ నది తీరంలో ఆజా ఖానా ఎ జెహ్రా అనే ప్రార్థన మందిరం ఉంది.

నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918 వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటిగ్. ప్రాథమిక విద్య తప్పనిసరి చేసింది, పేదలకు ఉచితంగా విద్య అందించారు. సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ మొదలైన కర్మాగారాలు నెలకొల్ప బడినవి. నిజాం స్టేట్ రైల్వే నెలకొల్ప బడింది.

1965 లో, నిజాం భారత్ చైనా యుద్ధం 1962 సమయంలో 5000 కిలోల బంగారంన్ని యుద్ధ నిధికి అందించాడు.

నిజాం హిందువులు, ముస్లింలను తన రెండు కళ్ళుగా భావించి, అనేక దేవాలయాల పురోగతి కోసం అనేక సార్లు బంగారు, డబ్బుని విరాళంగా ఇచ్చాడు.

నిజాం రాష్ట్ర రికార్డును పరిశీలిస్తే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ 82,825 లను యడ్గిర్గుట్ట్ ఆలయానికి, 50,000 రూపాయల భద్రాచలం ఆలయం, 80 వేల రూపాయలకు తిరుపతి వెంకటేశ్వర ఆలయానికి దానం చేశాడని తెలుస్తున్నది.

1932 సంవత్సరంలో, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (పూణే), హిందూ “మహాభారతం” సంకలనం మరియు ప్రచురణకు, అలాగే “నిజాం గెస్ట్ హౌస్” గా పిలువబడే అతిథికి 50,000 రూపాయలు అందించినట్లు పేర్కొన బడింది.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1967 ఫిబ్రవరి 24 న కింగ్ కోఠి ప్యాలెస్లో మరణించాడు.

నిజాం అంత్యక్రియల ఘట్టం భారత చరిత్రలోనే అతి పెద్దదిగా, 10 మిలియన్ ప్రజలు నిజాం ఊరేగింపులో పాల్గొన్నట్లు భావించ బడుతున్నది.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments