5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeNewsఉగ్ర, యోగ నారసింహుల ఉత్తర దిగ్యాత్ర

ఉగ్ర, యోగ నారసింహుల ఉత్తర దిగ్యాత్ర

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీయోగానంద, ఉగ్రనారసింహ స్వాముల ఉత్సవ మూర్తులను వేదమంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధు లగుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులో గల ఉసిరికచెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనులు గావిం చారు. దేవస్థాన ఆస్థాన వేదపండి తులు రమేశ శర్మ, యజ్ఞా చార్యులు పురుషోత్తమాచార్య, అర్చక పౌరోహి తులు సంతోష్ శర్మ, రాజగోపాల్ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, రమణాచార్య, వంశీకృష్ణ, విజయ్ కిరణ్, అరుణ్ తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గ మధ్యలో పుర భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమ వద్దకు అపు రూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముగింపుగా ఇసుక స్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో, వేదికపై భోగమంటపాది కార్య క్రమాలను జరిపారు. అందులో సుదర్శన, ఆళ్వారులను ఆవాహనం చేసి, శ్రీనృపుని వేంచేపుచేసి, కలశ, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, బృహస్పతి పూజ, సరస్వతి, అష్టదిక్పాల కుల పూజలు చేశారు. వేదమూర్తులైన విప్రులు, ఆలయాల అర్చకులచే శ్రీనృసింహునికి దివ్యార్చనలు, ఆరాధనోత్సవాలు నిర్వహించారు. చతుర్వేద సహిత వేద సభను ఏర్పాటు గావించారు. ఋగ్వేదంచే స్వామిని ఆనంద పరిచి, యజుర్వే దముచే లోక కళ్యాణార్ధం అభయ హస్తం చూపించి, సామ వేద ముచే సంగీత గాన కళాభివృద్ధి గావించి, అధర్వణ వేదముచే లోకము నందు సుఖశాంతులు వర్ధిల్లుటకు, ఆయురారోగ్యాదులు కలుగ జేయుటకు చతుర్వేదములతో, వేదమూర్తులైన విప్రోత్తములు సుస్వర మంత్రోచ్ఛారణ లచే స్వామిని సేవించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యులు, సీ.అ.శ్రీనివాస్ మార్గ నిర్దేశం చేసిన కార్యక్ర మంలో అర్చకులు కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు పాల్గొన్నారు.

గోదావరి నదిలో మంగళ స్నానాలు

ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేష భక్తులు సాంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. ధర్మపురి నారసిం హుడు మహారాష్ట్ర ప్రాంత వాసులకు కులదైవమైన క్రమంలో గురువారం సుదూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాలలో పరంపరానుగత వంశాచారంలో భాగంగా భక్తులు క్షేత్రానికి చేరుకు న్నారు. తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాల అనంతర దర్శనాలకై విచ్చేసిన రాష్ట ఇతర భక్తులు, గోదావరి పౌరోహితులచే సంక ల్పాది సత్కర్మలను ఆచరించి, దానధర్మాలు చేసుకున్నారు. నది వద్దే వంటలు చేసుకుని, నదీమ తల్లికి నివేదించి, ఆరగించారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు

సుదూర ప్రాంతాల నుండి వంవపారంపర్య సాంప్రదా యాచరణల ప్రకారం అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు, యాత్రికులు గోదావరినదికి నేరుగా వెళ్ళి, మంగళ స్నానాలు ఆచ రించి, సంకల్ప దానధర్మాది సత్కర్మలు ఆచరించి, దైవదర్శనా లకై దేవ స్థానం వద్ద ఆలయాల ముందు బారులు తీరి నిలుచు న్నారు. యోగానంద, ఉగ్ర నారసిం హునికి ముడుపులు చెల్లించి మెక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెల సాఫల్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నయానికి, మానసిక రుగ్మతల నివారణకు భక్తులు బెల్లం, కొబ్బరి కాయలు, వస్త్రాలు, కోడెముక్కులు, వల్లుబండ, గండా దీపాది మొక్కులు తీర్చుకున్నారు. సంతానార్థం హోమ గుండంవద్ద ప్రత్యేక పూజలు చేయించు కున్నారు.

హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగానంద), శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్స వాల సందర్భంగా, దేవస్థానం లోని ప్రధానాలయాలలో సోమవారం విధివిదాన సాంప్రదాయ ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన వంశపారం పర్య పౌరోహితులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ,. ముత్యాల శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసాచార్య, రమణా చార్య, నరసింహమూర్తి, శ్రీధరాచార్య, కిరణ్, మోహన్, వంశీ, విజయ్ వేదోక్త రీతిలో ఉత్సవ ప్రత్యేక అర్చనలు గావించారు. నిత్య పూజలతోపాటు ద్వార తోరణాది హవనములు, స్వామికి శక్తిని కలుగజేసేందుకు హోమధూళిచే శక్తి హోమం, నక్షత్ర, నవగ్రహ సప్తజిహ్వ, షడంగ న్యాస, పంచసూక్త, పురుషసూక్త, శ్రీసూక్త, భూసూక్త, నీలాసూక్త, పరివార హోమాలు, సర్వ సస్యాభివృద్ధికై, సర్వదేవతావహన హోమాలు, ఉత్సవాంగ ప్రధాన హోమం, లోక కళ్యాణార్థం రక్షాసు మంత్ర స్మరణం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణాది కార్యక్రమా లను నిర్వహించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments