రాష్ట్రం కనీ వినీ ఎరుగని రీతిలో ధర్మపురి క్షేత్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ఎల్ ఎం కొప్పుల చారిటెబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు మంగళ వారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయినాయి. మునుముందుగా దేవస్థానంలో లక్ష్మీ నరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం నుండి ప్రభుత్వ కలాశాల క్రీడా మైదానం లోనే వేదిక వద్దకు కళాకారుల విన్యాసాలతో భారీ సంఖ్యాకులతో చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఉగాది తెలుగు ప్రజల సనాతన సంప్రదాయ రీతిలో నిర్వహించుకునే పండగ అని, e నేపథ్యంలో గతించనున్ను సంవత్సరపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, చెడును వీడి, మంచి మార్గాన్ని
ఆచరించాలని ఆశించారు. కొవిడ్ సందర్భ సమయంలొ విశేష సేవలను అందించిన సేవకులకు సత్కారాలు, సన్మానాలు చేయడం కార్యక్రమ లక్ష్యం అన్నారు. ముఖ్య అతిథి పెద్ద పెల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ, మంత్రి ఈశ్వర్ సేవలను కొనియాడారు.
ట్రస్ట్ నిర్వాహకులు స్నేహ లత ఈశ్వర్ సంస్థ లక్ష్యాలను సేవలను వివరించారు. ఈ సందర్భంగా నందినీ, ప్యారమిత, చుక్కా రామయ్య ఏస్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఒగ్గు డోలు కళా కారుల పిరమిడ్ విన్యాసాలు అలరించాయి.
రంగాల నిపుణులను సామాజిక సేవకులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ వ్యాఖ్యాత నంది శ్రీనివాస్ వ్యాఖ్యానం, గాయకులు గుండి జగదీశ్వర్ గానం మకుటాయమానంగా నిలిచాయి.