5.1 C
New York
Sunday, May 28, 2023
HomeEntertainmentMovie Updatesపలు భాషల్లో వరుస సినిమాలతో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి హవా 

పలు భాషల్లో వరుస సినిమాలతో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి హవా 

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

నేడు (ఏప్రిల్ 16) విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితుల నుంచి బెస్ట్ విషెస్ అందుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘శివ’ సినిమాతో సినీ జర్నీ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన జేడీ చక్రవర్తి.. నటుడిగా, విలన్‌గా, హీరోగా పలు వైవిద్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. 
”మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా” లాంటి సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. ఒకానొక సమయంలో హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన రీసెంట్‌గా ఎంఎంఓఎఫ్ (MMOF) అనే థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకున్నారు. దర్శకుడిగా ”హోమం, సిద్ధం” లాంటి సినిమాలు చేసి తన టాలెంట్ బయటపెట్టే ప్రయత్నం చేశారు. 
గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో క్రియాశీల నటుడిగా వెలుగొందుతున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు.  హిందీలో ఏక్ విలన్ పార్ట్- 2, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, దహినితో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. 
తమిళ్‌లో సింగం ఫిలిం ప్రొడక్షన్ వారి ప్రతిష్టాత్మక సినిమా ‘కర్రీ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు జెడీ చక్రవర్తి. ఈ సినిమాలో శశి కుమార్ హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘పట్టరాయ్’ అనే మరో తమిళ సినిమాలో భాగమవుతున్నారు.       
ఇకపోతే ప్రస్తుతం కన్నడలో రెండు సినిమాల్లో జెడీ చక్రవర్తి నటిస్తున్నారు. అందులో ఒకటి జోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రేమ్’ కాగా మరొకటి థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ WHO. తెలుగులో మాంగో ప్రొడక్షన్స్ వారితో ‘బ్రేకింగ్ న్యూస్’, JK క్రియేషన్స్ బ్యానర్‌పై ‘ది కేస్’ సినిమా చేస్తున్నారు. అలాగే మలయాళంలో రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు కమిటై ఉన్నారు. పలు భాషల్లో జెడీ చక్రవర్తి చేస్తున్న సినిమాల ప్రవాహం చూస్తుంటే ఇండియా వైడ్ మరోసారి ఆయన పేరు మారుమోగుతూ సిల్వర్ స్క్రీన్‌పై జేడీ మార్క్ కనిపిస్తుందని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments