ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరు విద్యార్థినులు మృతి –

Date:


Attempted suicide Two female students died– శోకసంద్రంలో ఇరు కుటుంబాలు
– ఘటనపై పలు అనుమానాలు
– ఆకతాయిలు ఫొటోలను మార్ఫింగ్‌ చేయడం వల్లే..?
నవ తెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనగతుల మనిషా(20), నక్కలపల్లి గ్రామానికి చెందిన దంతరబోయిన శివాని(20) నలగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బిజెడ్‌సి సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఇద్దరూ నార్కట్‌పల్లిలోని ఒకే కాలేజీలో కలిసి ఇంటర్‌ చదివారు. అప్పటి నుంచి స్నేహితులు. కాగా ఇద్దరికీ నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలోనే సీటు లభించడంతో అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ఓ హాస్టల్‌లో కలిసి ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే, 20 రోజుల కిందట ఇరువురూ ఇంటికి వెళ్లారు. కళాశాలలో పరీక్షలు ఉండటంతో మంగళవారం ఇద్దరూ తిరిగి నల్లగొండకు వచ్చారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల వెనకాల ఉన్న రాజీవ్‌ పార్క్‌లో గడ్డి మందు తాగారు. పార్కు బయటకు వచ్చి ఇద్దరూ స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని 108 ద్వారా వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. అయితే, వాట్సప్‌ అకౌంట్‌కు వారు డీపీగా పెట్టుకున్న ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీలంగా మార్చి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతోపాటు బెదిరించడం వల్లే విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థినుల మృతిపై అనుమానాలు
డిగ్రీ విద్యార్థినుల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మనిషా, శివాని నాలుగేండ్లుగా కలిసి చదువు కుంటున్నారు. అయితే, ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అను మానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి చాటిం గ్‌ను గమనిస్తే.. ముందుగానే ఆత్మహత్యకు ప్లాన్‌ వేసుకున్నట్టు గుర్తించారు. శివాని ఓ ఫర్టిలైజర్‌ షాపు వద్దకు వెళ్లి గడ్డి మందు అడగ్గా.. వారు అమ్మనని చెప్పడంతో మా అమ్మ ఇమ్మంటుందని మనిషాకు ఫోన్‌ చేసి తల్లి, బిడ్డల్లాగా ఫోన్‌ మాట్లాడుకోవడంతో ఆ షాపు యజమాని నమ్మి మందు విక్రయించినట్టు తెలిసింది. చాటింగ్‌లో కూడా తెల్లవారుజామున ఇద్దరు మెసేజ్‌ చేసుకుని.. ఇంత పొద్దుగాల షాపులు తీయరు కదా అని మాట్లాడుకుని షాపులు తీసిన తర్వాత మందు కొనుగోలు చేసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. వారి మృతికి కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
ఉన్నత విద్యాభ్యాసం చదువుతున్న తమ పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారని ఆశించిన తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాలను కలిచి వేసింది. కుటుంబ సభ్యుల రోదనలతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా
విద్యార్థినుల ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ప్రసన్న మాట్లాడారు. ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినులు శివాని, మనిషా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలను అశ్లీలకరంగా మార్ఫింగ్‌ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలంటూ విద్యార్థినులను బ్లాక్‌మెయిల్‌ చేసిన వారిపై సమగ్ర విచారణ చేపట్టి శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...