మజిలీ చిత్రంతో నాగ చైతన్య కెరియర్ లో అతిపెద్ద హిట్ ను అందించిన శివ నిర్వాణ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో టక్ జగదీష్ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రంలో నాని సరసున పెళ్లి చూపులు ఫేం రితు వర్మ,ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, సన్ షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుండి ఈమధ్యే ఇంకోసారి అనే ఓ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సాంగ్ సినీ అభిమానులను బాగా అలరిస్తుంది.అందుకే అతి తక్కువ టైంలో ఈ లిరికల్ సాంగ్ 20 మిలియన్ మార్క్ ను అందుకొని రికార్డ్ ను కూడా నెలకొల్పింది.తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన మూవీ టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఆ టీజర్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.