Tuesday, August 9, 2022
HomeEntertainmentMovie Updatesఫణికుమార్ అద్దేపల్లి ట్రావెలింగ్ సోల్జర్

ఫణికుమార్ అద్దేపల్లి ట్రావెలింగ్ సోల్జర్

మోషన్ పోస్టర్ & ఫస్ట్ లుక్ రిలీజ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ట్రావెలింగ్ సోల్జర్’. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో బాలకృష్ణ క్యారెక్టర్ ప్లే చేసిన బాలు హీరోగా పరిచయం అవుతున్నాడు.
70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది. ఈ చిత్రానికి కెమెరా: నరేన్, మాటలు: చిట్టి రాజు, కో-డైరెక్టర్: ప్రణీత్, సంగీతం: జితేంద్ర, కాస్ట్యూమ్స్: సరస్వతి అద్దేపల్లి, నిర్మాత: అంగముత్తు రాజా, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments