మల్లన్నకొండల్లో మరోవిహారం
-సోమేశ్వరుడి నుంచి మల్లికార్జునుడి సన్నిధికి..
-సోమశిల -శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
-టూరిజం హబ్‌గా తెలంగాణ
-పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా కల్పించాలి
-పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-రెండుగంటలపాటు లాంచీలో ప్రయాణం

పచ్చని నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల సోమేశ్వరుడి సన్నిధానం నుంచి ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధి వరకు మరుపురాని విహారానికి తెలంగాణ టూరిజంశాఖ శ్రీకారం చుట్టింది.
శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లో పయనించే లాంచీని క్రీడలు, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
