వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు ఇవి పాటించకపోతే నష్టపోతారు.. | Top Monsoon Tips for People With Diabetes| Footcare tips for diabetic patients during monsoon| tips for diabetic patients| monsoon health tips| telugu health tips| diabetic foot

Date:

posted on Jul 6, 2023 3:13PM

వర్షాకాలం రుతుపవనాలు మాత్రమే కాకుండా వాటితో  పాటు అనేక వ్యాధులను కూడా తెస్తాయి, ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ వర్షాకాలం అతిపెద్ద ప్రమాదం. మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సీజన్‌లో వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువ.   

వాతావరణం మారుతున్న కొద్దీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముప్పు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు, కాలుష్యం,  కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం, ఈ సీజనల్ వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం. 

వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఇతర సీజన్లలో కంటే ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, అంటు వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.  వాతావరణంలో తేమ కారణంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు రింగ్వార్మ్, చర్మంపై దద్దుర్లు,  కాలిన గాయాలు వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

మధుమేహ రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో అంటు వ్యాధులు సోకితే వాటి  నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం

పాదాలకున్న ముప్పు..

డయాబెటిక్ పేషెంట్లకు డయాబెటిక్ ఫుట్ అనే సమస్య కూడా ఉంటుంది, ఇందులో పాదాల చర్మం చీలిపోయి, ఇన్ఫెక్షన్‌తో అల్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షం నీళ్లలో తిరగడం వల్ల కాలికి పుండ్లు తొందరగా వస్తుంటాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి పెద్ద ముప్పు తెచ్చిపెడతాయి. 

డయాబెటీస్ ఉన్న వ్యక్తికి బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తనాళాలు పెళుసుగా మరియు రక్తస్రావానికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది, డెంగ్యూ ప్రమాదం వీరిలో ఎక్కువగా ఉండవచ్చు.  డయాబెటిక్ పేషెంట్లలో డెంగ్యూ వచ్చినప్పుడు అంతర్గత రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తేలింది, అంతే కాకుండా  కోలుకునే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దోమల వల్ల వచ్చే వ్యాధుల నివారణపై అప్రమత్తంగా ఉండాలి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వర్షాకాలంలో  ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి, ఆహారంలో పండ్లు-కూరగాయలు, రోగనిరోధక శక్తిని పెంచే మసాలాలు చేర్చాలి.

ఫుట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి మంచి నాణ్యత గల బూట్లు, పాదాలు  కవర్ చేసే చెప్పులు ధరించాలి.

బయటి ఆహారాన్ని తినడం మానుకోవాలి, కడుపు ఇన్ఫెక్షన్ లేదా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఫుల్ స్లీవ్‌లు లేదా శరీరాన్ని బాగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా దోమల నుండి  రక్షించుకోవచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.

*నిశ్శబ్ద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...

రాష్ట్రంలో బీసీ గణన చేయండి –

– సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టండి– సీఎం కేసీఆర్‌కు...