5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleDevotionalToday Panchangam 01 February 2023 భీష్మ ఏకాదశి తిథి నాడు శుభ, అశుభ ముహుర్తాలెప్పుడో...

Today Panchangam 01 February 2023 భీష్మ ఏకాదశి తిథి నాడు శుభ, అశుభ ముహుర్తాలెప్పుడో చూడండి… – today telugu panchangam 01 february 2023 wednesday know today shubh muhurat and ashubh muhurat in telugu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

today telugu panchangam హిందూ, వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని పక్కాగా చూస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది. పంచాగం లెక్కించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సూర్యమానం, చాంద్ర మానం విధానాలనే అనుసరిస్తున్నారు. సూర్యుడి సంచారంతో అనుసంధానమైనది సూర్యమాన పంచాంగం, అదే విధంగా చంద్రుని సంచారంతో అనుసంధానమైనది చంద్రుని పంచాంగం. మన తెలుగువారు ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అందుకే చాంద్రమానం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఛైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. ఈ సందర్భంగా నేటి 01 ఫిబ్రవరి(February) బుధవారానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాష్ట్రీయ మితి మాఘం 12, శాఖ సంవత్సరం 1944, మాఘ మాసం, శుక్ల పక్షం, భీష్మ లేదా జయ ఏకాదశి తిథి, బుధవారం విక్రమ సంవత్సరం 2079. రజబ్ 09, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 01 ఫిబ్రవరి 2023

సూర్యుడు ఉత్తరాయణం, శిశిర బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మృగశిర నక్షత్రం అర్థరాత్రి 3:23 గంటల వరకు ఉంటుంది. ఈ తర్వాత ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు వృషభరాశి నుంచి మిధున రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Magh Purnima 2023 మాఘ పూర్ణిమ ప్రత్యేకతలేంటి… ఈ మాసంలో నదీ స్నానాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా…

నేటి ఉపవాస పండుగ : జయ ఏకాదశి వ్రతం

సూర్యోదయం సమయం 01 ఫిబ్రవరి 2023 : ఉదయం 7:09 గంటలకు
సూర్యాస్తమయం సమయం 01 ఫిబ్రవరి 2023 : సాయంత్రం 5:59 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : ఉదయం 5:24 గంటల నుంచి ఉదయం 6:17 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:23 గంటల నుండి మధ్యాహ్నం 3:07 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:08 గంటల నుండి మరుసటి రోజు 1:01 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 5:57 గంటల నుండి సాయంత్రం 6:24 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 8:30 గంటల నుండి ఉదయం 9:52 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 7:10 గంటల నుంచి అర్ధరాత్రి 3:23 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:13 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు
భద్రకాలం : ఉదయం 7:10 గంటల నుంచి మధ్యాహ్నం 2:10 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు విష్ణువును పూజించి, తులసి ఆకులను సమర్పించాలి.

– ఆచార్య కృష్ణ దత్త శర్మ

Read Latest Religion News and Telugu News

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments