అసంఖ్యాక కీర్తనలకు ప్రాణం పోసి, కర్ణాటక సంగీతంలోని నియమా లను సోదాహరణంగా నిరూపించి, కర్ణాటక సంగీతానికి మూల స్తంభమై, త్రైమూర్త్య వాగ్గేయ కారులలో ఒకరై, నాదోపాసన ద్వారా, భగవంతుని తెలుసుకో వచ్చునని నిరూపించి, ఆరాధనీ యులు అయినారు… త్యాగయ్య, త్యాగబ్రహ్మగా వినుతికెక్కిన వాగ్గేయ కారుడు కాకర్ల త్యాగరాజు. త్యాగయ్య కీర్తనలు, శ్రీరామునిపై ఆయనకుగల విశేష భక్తిని, వేదాల పై, ఉపనిషత్తులపై ఆయన కున్న జ్ఞానాన్ని తెలియ పరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అల వర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి. నేటి ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామంలో, 1767 లో మే 4న, తెలుగు వైదిక కుటుంబీకులైన కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ పుణ్య దంపతులకు త్యాగ రాజు మూడవ సంతానంగా జన్మిం చారు. అయన జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ములకనాడు తెలు గు బ్రాహ్మణులు. త్రిలింగ వైదీకులు. అయన పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి తంజావూరు ప్రభువు శరభోజి వద్ద ఉండే వారు. తాత గిరిరాజ కవి. త్యాగ బ్రహ్మం విద్యకోసం, తిరువా రూర్ నుండి తిరువయ్యూరు వెళ్లారు. అక్కడ సంస్కృతం, వేద వేదాంగములు ఆమూలాగ్రంగా పఠించి , శొంఠి వెంకట రమణయ్య వద్ద, భక్తిశ్రద్ధలతో సంగీతంలో ప్రావీణ్యం సంపాదించు కున్నారు. తండ్రి పిన్న వయసు నందే స్వర్గ ప్రాప్తి నొందగా, అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారంలో, తమ వంతు వచ్చిన, శ్రీరామ లక్ష్మణ కుల విగ్రహా లను పూజిస్తూ, ,”ఉంఛ” వృత్తి స్వీకరించి, ఇష్ట దైవమైన శ్రీ రాము నిపై కృతుల రచనలో అధికభాగం గడిపారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామ జపం ఆచరించి భగవద్దర్శనం, ఆశీర్వచనం పొందారని చెబుతారు. 18 ఏళ్ల వయసులో, పార్వతి అనే యువ తిని వివాహ మాడారు. పార్వతి చిరు ప్రాయ మరణంతో, ఆమె సోదరి కమలను పరిణయ మాడా రు. సీతా లక్ష్మి అనే కూతురు కలిగింది, ఆమె ద్వారా మనమడు కూడా కలిగాడు. కానీ, మనమడు చిన్నతనం లోనే మృతి చెందడం తో, ఆయనకు వారసులు లేకుండా పోయారు. శొంఠి వెంకట రమణ య్య శిష్యరికంలో 13వ ఏటనే “నమో నమో రాఘవా” అనే కీర్తనను “దేశిక తోడి రాగం”లో స్వరపరిచారు. త్యాగరాజు మంచి వైణికులు కూడా. గురువుగారి గృహములో చేసిన కచేరీలో, త్యాగరాజ పంచరత్న కృతులలో ఐదవది అయిన, “ఎందరో మహానుభావులు” కీర్తన స్వరపరచి గానం చేశారు. త్యాగయ్య గొప్ప తనాన్ని గుర్తించిన గురువు, తంజా వూరు రాజుకు చెప్పగా, ఆ రాజు ధన, కనక, వస్తు, వాహనాలతో సభకు ఆహ్వానించాడు. కానీ తనకు “నిధి కన్నా రాముని సన్నిధి సేవే సుఖమ”ని భావించి, త్యాగ య్య అన్నింటిని తిరస్కరించారు. సంగీతంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం కన్నా, భగవదా రాధనకు ఒక సాధనంగానే చూశారాయన. తంజావూరు రాజు కానుకల తిరస్కార ఫలితంగా, సోదరుడు జపేశుడు, త్యాగయ్యచే నిత్య పూజలందుకునే, శ్రీరామ పట్టాభిషేకం విగ్రహాలను, కావేరీ నదిలో విసిరి వేయగా, శ్రీరామ వియోగాన్ని భరించలేక… దక్షిణ దేశ యాత్రలు చేసి, ఎన్నో ఆలయా లు, తీర్థ క్షేత్రాలను దర్శించారు. ఈ క్రమంలో అత్యద్భుత కీర్తనలను రచించారు.
“రామేతి మధురం వాచం” అన్నట్లు 96 కోట్ల సార్లు రామ నామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వ గాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామికి, దేవ ఋషి అయిన “నారదుడే” స్వయంగా సంగీతంలోని రహస్యాలను చెప్పి, “స్వరార్ణవము” ఇచ్చినట్లు, ఆ సందర్భంలోనే “సాధించెనే మనసా” అనే పంచ రత్న మాలిక లోని మూడవ కృతి చేసినట్లు ప్రాచుర్యంలో ఉన్నది. నారద అనుగ్రహ ఫలితంగానే అనేక విషయాలు గ్రహించి, 24వేల రచనలు, 800కీర్తనలు గావించాడు. మంత్రోపదేశం తో “స్వర్ణార్ణవం, నారదీయం” అనే రెండు సంగీత రహ స్యార్థ శాస్త్ర గ్రంథ రచనలు గావించారు. త్యాగయ్య కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్టానం, అని నాలుగు విధాలుగా గుర్తిం చారు. చాలావరకు తెలుగులో రచనలు చేసినా, అవి తెలుగు నాట కన్నా, తమిళ నాట ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జగదానంద కారకా అనే కీర్తన శ్రీరాముని 109 నామాలను ఉటంకిస్తుంది. “జగదానంద కారకా (నాట), దుడుకు గల (గౌళ), సాధించినే (అరభి), ఎందరో మహాను భావులు (శ్రీ), కన కన రుచిరా (వరాళీ,)”, అనేవి పంచ రత్న మాలికగా, “త్యాగరాజ ఆరాధనోత్సవాలలో” ప్రారంభం కీర్తనలుగా గానం చేయ బడతాయి. త్యాగరాజ స్వామి పరమపదించిన దినమైన, పుష్య కృష్ణ పక్ష పంచమి నాడు, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా తమిళనాడు లోని తంజావూరు జిల్లా తిరువయ్యూరు లోని, త్యాగయ్య సమాధి ప్రాంగణా న, ఉత్సవాలు ఏటా జరుగుతాయి. త్యాగయ్య 1847 జనవరి 6న తన 79వ ఏట మరణించగా, ఆయన మరణానికి ముందు సన్యాసిగా మారగా, ఆయన భౌతిక కాయాన్ని కావేరీ తీరాన ఖననం చేసి, అక్కడ స్మారక చిహ్నాల నిర్మాణం గావించా రు. ఆయన శిష్యగణం అక్కడే సంస్మరణ కార్యక్రమాలు జరుపగా, 1903 తర్వాత పట్టించుకునే స్థితిలో, ప్రముఖ సంగీత విద్వాంసులైన, ఉమయాల్పురం కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు తమ గురువు సమాధి దయనీయ స్థితికి చలించి, పునరు ద్ధరణ గావించారు. 1905లో త్యాగయ్య వర్ధంతి దినాన తిరువయ్యూరులో, అన్నదానం, సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. నాటినుండి దేశంలో పలుచోట్ల ఆరాధ నోత్సవాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలోనే సకల కళా నిలయమైన ధర్మపురి క్షేత్రంలో దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులు రాష్ట్ర ప్రభుత్వ సన్మానితులు సంగీత రత్న, కొరిడే నరహరి శర్మ ఆధ్వర్యంలో, మార్చి 19న ప్రారంభించ బడి, 21 వరకు రాష్ట్రంలోని లబ్ద ప్రతిష్టులు అయిన కళాకారులచే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సంగీత సామ్రాజ్య రారాజు త్యాగరాజు.
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES