కరోనా కారణంగా మూతపడిన థియేటర్ లు దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి తగ్గడంతో గత సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన తెరుచుకున్నాయి.50 శాతం ఆక్యుపెన్సీ తో తెరుచుకున్న థియేటర్స్ మొదటి రోజు నుండి కలకలలాడుతూ కనిపించాయి.సినీ ప్రేక్షకులను అలరించలని ఎదురుచూస్తున్న చిత్రాలన్నీ పెద్ద గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి విడుదలై వాటి బిజినెస్ చేసుకొని ప్రొడ్యూసర్స్ కు కొంత ఊరటనిచ్చాయి.
ఇక థియేటర్స్ తెరుచుకున్నాక మరోసారి దేశవ్యాప్తంగా కరోనా ప్రబలతుందని భయపడిన ప్రభుత్వ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోవడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం థియేటర్ ఆక్యుపెన్సీను పెంచాలని నిర్ణయం తీసుకుంది.దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుండి సరికొత్త గైడ్ లైన్స్ ను ప్రవేశపెట్టనున్నది.ఆ గైడ్ లైన్స్ ప్రకారం థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పెరుగనున్నది అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.ఆక్యుపెన్సీ ఎంత పెంచబోతుంది అని విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం దేశంలో అతి పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది.ఇలాంటి టైంలో థియేటర్ ఆక్యుపెన్సీ పెంచడం పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రిస్క్ తో కూడుకున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.