శివుడు అమంగళలను తొలగించువాడు అలాగే తన యందు శక్తికి స్థానాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యారు.అందువల్లనే శివుడు బ్రహ్మ, విష్ణువుకు ఆరాధ్యుడయ్యాడు. అలాంటి శివుని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒక్కటైన మహానంది గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ ప్రముఖ శైవ క్షేత్రం ఉంది.ఇక్కడ స్వామిని మహానందీశ్వరుడిగా అమ్మవారిని కామేశ్వరీ దేవిగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని 7 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని ఎవరూ నిర్మించారన్న దాని పై ఇంకా స్పష్టత రాలేదు కానీ ఇక్కడ శిల్పకళ ఆధారంగా బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలంలో (680-696) ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఓ అంచానకు వచ్చారు.
ఈ గుడి చుట్టూ మూడు కొలనులు కలవు.అందులో పెద్దది గుడి లోపల ఉన్నది.ఇక్కడున్న కొలనులోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది.ఇక్కడ గుండుసుదిని వేసిన స్పష్టంగా కనిపిస్తుంది.ఇక్కడ కోలనులోని నీరు చలికాలం లో వేడిగా వేసవికాలం లో చల్లగా సహజసిద్దంగా మారుతుంటాయి. ఈ క్షేత్రంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి.
ఇక్కడి స్థల పురాణం ప్రకారం శిలాద మహర్షి నల్లమల అడువులలో ఉన్న తన ఆశ్రమంలో జీవనం సాగిస్తున్నాడు.ఆయన భార్య కోరిక మేరకు శివ దీక్షను పూనారు.ఆయన దీక్షకు మెచ్చిన శివుడు తనకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.ఆయనను చూస్తూ తన్మయత్వంలో మునిగిన శిలాద మహర్షి తన దర్శన భాగ్యం కంటే మరేదీ అవసరం లేదని కోరాడు.
శిలాద మహర్షి భార్య కోరిక తెలిసిన శివుడు ఆమె కోరిన విధంగా వారికి ఓ కుమారుడిని ప్రసాదించారు.ఆ బిడ్డకు మహానందుడు అనే పేరును పెట్టారు.మహానందుడు చిన్ననాటి నుండి చక్కని లక్షణాలతో మెలుగుతూ శివ ఆరాధన చేస్తుండేవాడు.ఒకరోజు మహానందుడి వద్దకు వచ్చిన నారద మహర్షి తను ఒక అల్పాయుష్మంతుడని తెలియజేశాడు. దానితో మహానందుడు తన తండ్రి దగ్గరకెళ్ళి శివ దీక్షా అనుగ్రహాన్ని పొందాడు.
దానితో మహానందుడు స్వామిని నిష్ఠగా ప్రార్థించాడు.అతని భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని అడిగాడు.దానికి బదులుగా మహానందుడు తన వాహనంగా ఉంటూ ఆయనకు సేవలు చేయాలని కోరాడు.ఆ వరాన్ని స్వామి ప్రసాదించాడంతో ఆయన నందీశ్వరుడిగా మారి స్వామికి సేవలు చేస్తున్నాడు.శివుడు వాహనంగా నందిని స్వీకరించడానికి ఒప్పుకుంటున్న సందర్భంగా ఇక్కడ శివుడు వెలిశారని ప్రతీతి.
మరియొక కధ ప్రకారం : ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టక్రింద బాలకృష్ణుడు ఉండేవాడు.ఆయన ఆకలిని తీర్చడానికి రోజూ ఒక కపిలగోవు ఆపుట్టమీద పాలు వర్షిస్తూ ఉండేది.ఈదృశ్యం ఆగొల్లవాడు పెద్దనందునితో చెప్పాడు. నందుడు అక్కడికి వచ్చి ఆ వింతను చూచాడు. అతని రాకకు భయపడిన గోవు ఆ పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆపుట్టమీద ముద్రితమైనవి. ఇవాల్టికి కూడా అవి మనం చూడవచ్చును.ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం గా మారినది.ఇది మహానంది క్షేత్ర కథ.