Wednesday, November 30, 2022
HomeLifestyleDevotionalగ్రంథం సరస్వతి స్వరూపం

గ్రంథం సరస్వతి స్వరూపం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

“అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అని ఆర్యోక్తి. అక్షరం ఒక శక్తివంత మైన ఆయుధం. మానవుని భావనా తరంగా లు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువ గలిగే సాధనం అక్షరం. మనిషి అయు ప్రమాణం వందేళ్ళయితే, గ్రంధ ఆయు ప్రమాణం అనంతం. ఆ కారణంగానే హిందూ ధర్మంలో గ్రంథాన్ని సరస్వతి రూపంగా భావిస్తూ, గ్రంధ పూజను పుస్తకాల (సరస్వతి) పండుగ పేరుతో శరన్నవరాత్రులలో నిర్వహించే ఆచారం కొనసాగు తున్నది. గ్రంథం పొరపాటున కాలికి తగిలితే, కళ్ళకు అడ్డుకునే సత్సంప్రదాయం భారతావనిలో ఉంది.
గ్రంధానికి వయసు అనేది లేదు. అపౌరు షేయాలని భావించే వేదాలు మొదలు కుని, 2300ఏళ్ళ క్రితం కౌటిల్యుడు అర్ధశాస్త్రం, అనంతరం పాణిని ‘అష్టా ధ్యాయి’, పతంజలి ‘యోగ శాస్త్రం’, భరతముని ‘నాట్య శాస్త్రం’, హాలుని ‘గాధా సప్తశతి’ ఇలా ప్రాచీన గ్రంథాలెన్నో ప్రపంచ సాహిత్యాకాశాన ధ్వజాలలాగ రెపరెపలాడే కీర్తి సంకేతాలుగా నిలుస్తున్నాయి.

గ్రంథానికి మృతి లేదు. అక్షర రూపం దిద్దుకున్న ఆలోచన, రాసిన వసువును బట్టి ఎంతకాలం మన గలుగుతుందో నిర్ణయ మవుతుంది. తాళ పత్ర, బూర్జ పత్ర, తామ్ర పత్ర, చర్మ పత్ర రూపాలలో ఉన్నవి శిథిలాలైతే, తిరిగి ప్రతి లేఖనా లవుతాయి. మనిషి అజ్ఞానం తోనో , తెలియకో, విలువ స్వార్థపరుడై విధ్వంసం చేస్తే తప్ప, తామ్ర, శిలా రూపాలకు చావే లేదు కదా.

భారతీయ సాహిత్య సంబంధిత అనేకానేక అపురూప గ్రంధాలు విదేశీ యులను ఆకర్షించాయి. అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలనే తలంపులో భాగంగా, భారత దేశాన్ని జయించ డానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువైన ఆరిస్టాటిల్, మన దేశ తత్వ సాహిత్యన్ని తిరిగి వచ్చేపుడు తెమ్మన్నాడు. బుద్ధ బోధన గ్రంథాలు, విదేశీ యాత్రికుల సందర్శనలకు హేతువులైనాయి, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్టాన్, మంగోలియా దేశీయులు భారత సందర్శనతో పాటు, ఇక్కడి బౌద్ధ సాహిత్య మూల, అనువాద రూపాలలో తీసుకెళ్ళారు. అక్షరం కనుగొన బడ డానికి ముందు వేద వాజ్మయం శ్రుత సాహిత్యంగా ఉండేది. శ్రౌతం లిఖితం కావడం మానవ సంస్కృతీ వికాస పరి ణామ క్రమంలో ముఖ్య ఘట్టం. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ప్రస్తాన త్రయం, భారత భాగవత రామాయ ణాలు, ఉప పురాణాలు, స్మృతి గ్రంధాలు, భారతీయ కథా సాహిత్యం, గ్రంథ రూపం సంతరించుకున్నాక, ప్రపం చంలో ఏ జాతీ, ఏ దేశం, భారత దేశానికి సాటి రావని, సర్వ ప్రపంచానికి ద్యోతకమైంది. భారతీయ సంస్కృ తిని చాటిచెప్పే గొప్ప మాధ్యమం గ్రంథం.

ప్రాచీన తాళపత్ర గ్రంధాలు నలంద, తక్షశిల తది తర విశ్వ విద్యాల యాలలో భద్రపరచ బడి, కొన్ని విదేశీ, విమతాల దాడులలో నశించాయి. మానవుని ఈర్ష్య, అసూయ, కుత్సిత బుద్ధి కారణాలుగా మానవ మేధ చాలాసార్లు మాడి మసి బొగ్గయింది. నేపాల్ విశ్వ విద్యాలయ గ్రంథాలయ భవనం ముందు యాభై వేల సంస్కృత అపురూప గ్రంథాలు తీవ్రవాదుల దాష్టీకానికి బలైన సంఘటన ఈ శతాబ్దపు విశాద ఘటన.

ముద్రణా యంత్రాలు వచ్చాక, ప్రతుల ప్రచురణ సులభమైంది. ఒకేసారి ఒక గ్రంథ వందలాది ప్రతులు సిద్ధ మయ్యే సౌలభ్యం ఏర్పడింది. అంతకు ముందు రాజాస్థానాలలో ప్రతులు తయారు చేసే ఉద్యోగులు ఉండే వారు. అయితే మానవ నిర్మిత గ్రంథ తయారీ పని బహుకష్టంతో కూడుకునేది.

గురువుకు ప్రాధాన్యత ఉండడం వల్లే గురు: బ్రహ్మ, గురుర్విష్ణు అన్న సూక్తి పుట్టుకొచ్చింది. దానిని ప్రసుతం గ్రంథా నికి వర్తింప చేయవచ్చు. గ్రంథా లయం అందుబాటు వల్ల దూరవిద్యా విధానం కూడా అమలు లోనికి వచ్చింది. ముద్ర ణా యంత్రాల ఆధునీకరణ జరిగింది. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ వల్ల ముద్రణ నాణ్యమైన, అందమైన ముద్ర ణలతో పాటుగా నేడు “ఈ గ్రంథాలు’’ ఉపయోగ పడుతున్నాయి. అయినా ముద్రిత గ్రంథ ఉపయోగం ఇంకా తగ్గు ముఖం పట్టలేదు.

గ్రంథస్థ విషయాలు ప్రపంచ మంత విస్తృతం, ప్రపంచ వ్యాపితం అవుతు న్నాయి. అనేకానేక శాస్త్ర గ్రంధాలు, సృజనాత్మక సాహితీ గ్రంథాలు, ఆధ్యాత్మి కాంశాలు, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసికోల్లాస ప్రధానాలు, ఒకటేమిటి… వేలాది అంశాలు, లక్షలాది గ్రంథాలు, కోట్లాది పాఠకులు నిత్యం దర్శనాలుగా ఉండడాన్ని చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రత్యేక గ్రంథం లోకి వెళితే, అది బాహ్య ప్రపంచాన్ని మరిపించే, ఒక ప్రత్యేక ప్రపంచం అవుతున్నది. అందుకే మనిషికి అక్షరమన్నా, గ్రంథమన్నా అంత ప్రేమ, మమకారాలు. ముద్రణ వల్ల గ్రంథానికి విలువ ఏర్పడింది కనుక, డిమాండును బట్టి, వ్యాపారాత్మకత కారణంగా అధిక ధరల ప్రపంచం ఏర్పడుతున్నది.

తొలి హైదరాబాద్ బుక్ ఫెయిర్ 1985లో హైదరాబాద్ లోని అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. అనంతరం నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో బుక్ ఫెయిర్లు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ గ్రౌండ్స్)లో పుస్తక ప్రదర్శన నిరంతరం కొనసాగుతోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పూలే పార్క్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2 నుంచి 8వ తేదీ పుస్తక ప్రదర్శన (బుక్‌ ఫెయిర్‌) నిర్వహి స్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రోత్సాహం వల్ల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో 50 స్టాళ్లలో 20 వేల పుస్తకాలను విద్యార్థులు, మహిళలు, ప్రజలు తిలకించి తమకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో మన ఊరు – మన చెట్లు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం సాహితీ కార్యక్ర మాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ వంటకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.
బహు భాషలు, రచయితలు, గ్రంథాలు, ముద్రాపకులు, ఒక్కచోట చేరితే అదొక విజ్ఞాన విశ్వమే కదా. అందుకే చాలా మందికి ప్రీతిపాత్రం గ్రంథాల జాతరా. దేవున్ని జారతలో కొలిచినట్లే, గ్రంథాలను పరమ పవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనే వారు, చదివే వారు, సంరంభాన్ని కన్నుల పండు వగా తిలకించే వారు, కౌటుంబిక, స్నేహ, ప్రేమికుల, విద్యార్థుల, రచయితల, కవుల, సాహితీ కారుల బృందాలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకునే కరీంనగర పుస్తక మేళాకు వెళ్ళిన వారికి మరచి పోలేని అనుభూతులను మిగులు స్తుంది అనేది నూటికి నూరు పాళ్ళు నిజం.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments