5.1 C
New York
Saturday, June 3, 2023
HomeLifestyleDevotionalభక్తుల కొంగు బంగారం...

భక్తుల కొంగు బంగారం…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

గోదావరీ నదీ దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భార తీయులకు సేతువై నిలిచిన ఈ ప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టు కొని పోయినా, ఔత్సాహికులైన చారి త్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలి తంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకు లలో, అక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికి రా గలిగింది. శాతవాహన వంశానికి మూలపురుషుడని భావింపబడే శ్రీముఖుడు కోటిలింగాలను రాజధా నిగా చేసుకుని పాలించాడనడానికి ఆధార భూతమైన, ఆయన నాణాలు కోటిలింగాలలో లభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. అవిభక్త కరీంనగర్, ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజక వర్గంలో, ధర్మపురి క్షేత్రానికి 19కి.మీ.ల దూరాన వెల్లటూరు మండలం లోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థాన మందుగల కోటిలింగాలలోని పుట్టుకోట గోడలు (పూర్వపు కోటలు) ఆంధ్రదేశ పాలకు లైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి. హాల చక్రవర్తిగాధా సప్తశతిలోని గోదావరీ వర్ణన ఆధారంగా, లభ్యమైనట్టి సిముఖ నాణాలను బట్టి కోటిలింగాల శాతవాహనుల బలిష్ట దుర్గమని స్పష్టమైంది. కోటిలింగాల సమీపమునగల గుట్ట జైనము నుల కావాస స్థానముగ నుండేదని తెలుస్తున్నది. ఒకనాడు ఇక్కడి గోదావరి ఓడరేవు ద్వారా వాణిజ్య సరుకులు బంగాళాఖాతం తద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా జరిగేదని చారిత్రక పరిశోధకులు తేల్చారు. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపుబౌద్ధ స్టూపం పాషాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్యయుగానికి చెందిన దేవాలయం గ్రామంలో ఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటప ముంది. ప్రతి గర్భ గృహంలో అంతరాళం ఉంది. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగరూపుడుగా ప్రతిష్ఠితు డుకాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో సిద్ధేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు. ఆలయం చాళుక్య కళారీతులలో నుండి గోదావరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమలున్నాయి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక శాఖ గుర్తింపు పొందింది. ప్రస్తుతం పర్యాటక శాఖ పక్షాన రెండు బోట్లు జల విహారానికి కేటాయించారు. స్థానికుల, దాతల చేయూతతో, ధర్మకర్తల మండలుల కృషితో, ప్రత్యేక నిధులను ప్రోగు చేసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి పరుచు కున్నారు. ఇటీవలి గోదావరి పుష్కరాలలో లక్షలాది భక్తులు దర్శించాక, మిగుల ప్రచారం పొందిందీ తీర్థం , క్షేత్రం. ధర్మపురి శాసనసభ్యులుగా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఉన్న కొప్పుల ఈశ్వర్ చొరవతో ఇక్కడ గత పుష్కరాల సందర్భంగా అనేక పనులతో అభివృద్ధి పరిచి పుష్కరాలను ఘనంగా నిర్వహింప చేశారు. అలాగే ప్రత్యేక నిధులతో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో విశేష అభివృద్ధి జరుగుతున్నది. ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొప్పుల ఈశ్వర్ కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ మలి ప్రభుత్వంలో సంక్షేమ శాఖల మంత్రి పదవులను చేపట్టాక, ఈ ఆలయం హరిత హోటల్ తదితర నిర్మాణ ప్రతిపాదనలతో, మరింత అభివృద్ది పనులు చేపడుతూ, పర్యాటక శోభను సంతరించు కుంటున్నది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments