తరిమెల నాగిరెడ్డి (ఫిబ్రవరి 11, 1917 – జులై 28, 1976) అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కమ్యూ నిస్టు నాయకులలో ఒకరు. ఆయ నను అందరూ టి.ఎన్ అని పిలిచే వారు. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917 న రైతు కుటుంబములో జన్మించారు.
పాఠశాల రోజుల నుండే సమాజం లోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరి చారు. మద్రాసు లోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యా నికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగ లేదు. లయోలా కళాశాల యాజమాన్యం నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసా లకు హాజరైనందుకూ, రామస్వామి ముదలి యారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీ లలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి, బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో విద్య నభ్యసించారు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలా దేవి ఛటోపాధ్యాయ, జయ ప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితు డయ్యారు. కమ్యూనిజం, మార్క్సి జం తో ఈయనకు వారణాసిలోనే పరిచయ మయ్యింది. రష్యన్ విప్లవము, స్టాలిన్ నాయకత్వం గురించి విస్తృతముగా చదివి, భారత దేశశంలో కూడా మార్క్సి జాన్ని అమలు చేయవచ్చని నమ్మటం ప్రారంభించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకో త్సవంలో ఉపకులపతిని నిల దీశారు. మహాత్మా గాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ కలాపల వల్ల అనేక మార్లు జైలుకు వెళ్లారి. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళారు. తిరుచిరా పల్లి జైలునుండి విడుదల కాగానే తిరిగి 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యారు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డారు.
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసన సభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంత పురం నియోజక వర్గం నుండి ఎన్నికయ్యారు. జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రెస్ కాంగ్రేసు నాయకులు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించిన ఘనత ఆయనకే దక్కింది. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజక వర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడి పోయారు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజక వర్గం నుండి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి 1962లో పుట్లూరు నియోజక వర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనారు. 1967లో నియోజక వర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దు కాగా, సి.పి.ఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో సారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారత దేశం).
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూ నిష్ట్ రెవల్యూషనరీస్ (ఎ.పి.సి.సి.ఆర్) – ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించారు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్త పార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యారు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొన సాగారు. నాగిరెడ్డి 1976, జులై 28న మరణించారు.