Thursday, December 8, 2022
Homespecial Editionఫిబ్రవరి 24... పురుచ్చితలైవి జయంతి

ఫిబ్రవరి 24… పురుచ్చితలైవి జయంతి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఒక రాష్ట్ర రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయ లలిత ఒకరు. త‌మిళ‌నాడు రాష్ట్రా నికి ఆరు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.

సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.

1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకా లోని మెల్కోటేలో.. తమి ళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. జయలలిత తల్లి వేదవల్లి, తండ్రి జయరాం. జయరాం లాయరుగా పని చేసే వారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. ఆమె తాత నరసిం హన్‌ రంగాచార్యులు.. మైసూరు మహారాజా సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా ఉండేవారు. జయలలిత జన్మించిన రెండేళ్లకే ఆమె తండ్రి చని పోయారు. దీంతో ఆమె కుటుంబం బెంగుళూరులోని అమ్మమ్మ గారింటికి చేరారు. తల్లి వేదవల్లి బెంగుళూరులో చిన్న ఉద్యోగంలో చేరారు.

జయలలిత చాలా చురుకైన విద్యార్థిని. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండే వారు. ప్రాథమిక విద్యను బెంగుళూ రు బిషప్‌ కాటల్‌ బాలికల పాఠశాల లో పూర్తి చేశారు. మద్రాసు చర్చ్‌ పార్క్‌ కాన్వెంట్‌లోను కొనసాగిం చిన జయలలిత మెట్రిక్యులేషన్‌‌లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. చదువు కుంటూనే సంప్రదాయ భరత నాట్యం తో పాటు మోహినీ యాట్టం, మణిపురి, కథక్‌ వంటి నృత్య రీతులను జయలలిత నేర్చు కున్నారు. సంప్రదాయ కర్నాటక సంగీతం కూడా అభ్యసించారు.
మద్రాస్‌లో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ.. సినిమాలో నటించాలనే ప్రబలమైన కోరికతో, అవకాశాల కోసం ప్రయత్నించారు. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాల తో ప్రారంభించి.. ఆశించిన విధంగా సినీ నటి స్థాయికి ఎదిగారు.

జయలలిత 1961 లో క‌న్న‌డ సినిమా “శ్రీ శైల మ‌హాత్మే” తో సినీ రంగ ప్రవేశం చేశారు. బాల‌న‌టిగా అడుగు పెట్టారు. 1965 లో సీ.వీ. శ్రీధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన “వెన్ని రాడై”తో త‌మిళ చిత్ర సీమ‌లో అరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత ఎమ్‌.జీ. రామ‌చంద్ర‌న్‌ (ఎమ్‌జీఆర్‌) స‌ర‌స‌న 28 సినిమాలు, శివాజీ గ‌ణే ష‌న్‌తో 17 సినిమాలలో నటించా రు. న‌ట‌న‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి నందుకు ఆమె ఎన్నో అవార్డుల‌ను సాధించారు. జయలలిత తమిళం తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లా డే వారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సిని మాల్లో జయలలిత నటించారు. ఆమె నటించిన ఏకైక హిందీ సినిమా ఇజ్జత్.

జయలలిత …కథానాయకుని కథ (1965), మనుషులు మమతలు (1965), ఆమె ఎవరు? (1966), ఆస్తిపరులు (1966), కన్నెపిల్ల (1966), గూఢచారి 116 (1966), నవరాత్రి (1966), గోపాలుడు భూపాలుడు (1967), చిక్కడు దొరకడు (1967), ధనమే ప్రపంచ లీల (1967), నువ్వే (1967),
బ్రహ్మచారి (1967), సుఖ దుఃఖాలు (1967), అదృష్టవంతులు (1968),
కోయంబత్తూరు ఖైదీ (1968),
తిక్క శంకరయ్య (1968), దోపిడీ దొంగలు (1968), నిలువు దోపిడి (1968), పూలపిల్ల (1968),
పెళ్ళంటే భయం (1968), పోస్టు మన్ రాజు (1968), బాగ్దాద్ గజ దొంగ (1968), శ్రీరామకథ (1968), ఆదర్శ కుటుంబం (1969), కథా నాయకుడు (1969), కదలడు వదలడు (1969), కొండవీటి సింహం (1969), పంచ కళ్యాణి దొంగల రాణి (1969), ఆలీ బాబా 40 దొంగలు (1970), కోటీశ్వరుడు (1970), గండికోట రహస్యం (1970), మేమే మొనగాళ్లం (1971), శ్రీకృష్ణ విజయం (1971), శ్రీకృష్ణసత్య (1971), భార్యా బిడ్డ లు (1972), డాక్టర్ బాబు (1973), దేవుడమ్మ (1973), దేవుడు చేసిన మనుషులు (1973), లోకం చుట్టిన వీరుడు (1973), ప్రేమలు – పెళ్ళి ళ్ళు (1974), నాయకుడు – వినా యకుడు (1980) తదితర తెలుగు చిత్రాలలో విభిన్న పాత్రలలో జయలలిత నటించారు.

ఎం. జీ. రామచంద్రన్ స్థాపించిన ఆల్ ఇండియా అన్నా ద్ర‌విడ మున్నేట్ర క‌ళ‌గం (ఏఐడీఎంకే) లో చేర‌డం ద్వారా ఆమె త‌న రాజ‌ కీయాల్లోకి అడుగు పెట్టారు. ఎంజీఆర్ కు సన్నిహితురాలిగా ఉంటూ 1984 నుంచి 1989 మ‌ధ్య రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ప‌ని చేశారు. 1987 లో ఎమ్‌జీఆర్ మ‌ర‌ణానంత‌రం 1989 లో ఏఐడీఎంకే అధినేత్రి అయ్యారు. 1991 లో పార్టీని అధికారం లోకి తెచ్చి, త‌మిళ‌నాడులో మొత్తం ప‌ద‌వీకాలం పూర్తిచేసిన‌ మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా గుర్తింపు పొందారు. తమిళనాట రాజకీ యాల్లో క్రియాశీలకంగా వ్యవహ రించి ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరు గాంచిన జయలలిత 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయి, అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె…

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments