5.1 C
New York
Saturday, March 25, 2023
HomeEntertainmentMovie Updatesఅన్ని హంగులతో విడుదలకు సిద్ధమైన "తెలంగాణ దేవుడు

అన్ని హంగులతో విడుదలకు సిద్ధమైన “తెలంగాణ దేవుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

అన్ని హంగులతో విడుదలకు సిద్ధమైన “తెలంగాణ దేవుడు””తెలంగాణ దేవుడు”..  ఇది 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన  ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశం అంటున్నాడు దర్శకుడు వడత్యా హరీష్. హీరో శ్రీకాంత్, హీరోయిన్ సంగీత, జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ ,మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణంతో వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహముద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న చిత్రం “తెలంగాణ దేవుడు”. ఈ చిత్రం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడి కాయ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ… 1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక ఉద్యమ ధీరుడుగా బయలుదేరి వారి కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే  “తెలంగాణ దేవుడు”. ఈ చిత్రాన్ని ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి మంచి పాటలతో అన్ని రంగాల వారికి నచ్చే విధంగా చిత్రీకరించడం జరిగింది. నా మొదటి చిత్రంతోనే 50 మంది పెద్ద నటీనటులను డైరెక్షన్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మహముద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు

మాక్స్ ల్యాబ్  సీఈవో ఇంతియాజ్ మాట్లాడుతూ .. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ చిత్రంలో మహముద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్ ను పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు.అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి మూడో వారంలో విడుదల చేస్తామని అన్నారు

లైన్ ప్రొడ్యూసర్ మహముద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చిందని అన్నారు

సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రానికి సంగీతం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేమందరం చిత్రం కోసం హాట్ ఫుల్ గా పనిచేశాము.రియాలిస్టిక్ గా నిర్మించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్, విజయ్ ఆత్రేయ, రవీంద్ర జయరాం తదితరులు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
ప్రొడ్యూసర్ :- మహముద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం :- వడత్యా హరీష్
మ్యూజిక్ :- నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ :-అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ :- గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్ :- మహముద్ ఖాన్
మాక్స్ ల్యాబ్ సి.ఈ. ఓ.:- ఇంతియాజ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments