5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeEntertainmentMovie Updatesతేజ, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ `విక్రమాదిత్య` టైటిల్ పోస్టర్ విడుదల.. ఈరోజు నుండి షూటింగ్‌ ప్రారంభం.

తేజ, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ `విక్రమాదిత్య` టైటిల్ పోస్టర్ విడుదల.. ఈరోజు నుండి షూటింగ్‌ ప్రారంభం.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు దర్శకుడు తేజ. తన పుట్టినరోజు సందర్భంగా  తేజ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `విక్రమాదిత్య`ను ప్రకటించారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ప్రతిష్టాత్మకంగా  ఈ ప్రేమకథను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో పేరున్న నిర్మాత కావ‌డంతో `విక్రమాదిత్యను` భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.

రైలు ఆవిరిలోనుండి హీరో హీరొయిన్లు రొమాన్స్ చేస్తున్న‌ట్లు చూపించారు. ఈ తరహా క్లాసిక్ ప్రేమ‌క‌థ‌ల‌ను ను తెరపై తొలిసారిగా చూడబోతున్నాం. ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే స‌మ‌యంలో సర్ ఆర్థర్ కాటన్ ధ‌వ‌లేశ్వరం బ్యారేజీని నిర్మించాడు. ఈ క‌థ ఆ కాలం నాటిద‌ని ఆ వంతెన‌కు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉంద‌ని తెలుస్తోంది.

విక్రమాదిత్య షూటింగ్ 22:2:22 మధ్యాహ్నం 2:22 గంటలకు శుభ ముహూర్తంలో ప్రారంభ‌మైంది,  ఆసక్తికరంగా తేజ యొక్క బ్లాక్ బస్టర్ జయం మూవీ షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అదే సమయంలో ప్రారంభమైంది.

ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: తేజ
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
బ్యానర్: లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
స‌మ‌ర్ఫ‌ణ‌: భవ్య
PRO: వంశీ-శేఖర్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments