రాజకీయాల్లో చెరగని ముద్ర తేళ్ల లక్ష్మీకాంతమ్మ

Date:

తేళ్ల లక్ష్మీకాంతమ్మ… ఈ పేరు ఈ తరం తెలుగు వారికి అంతగా తెలియక పోవచ్చు. అవిభక్త ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆరున్నర దశాబ్దాల క్రితం లోకసభకు ఎన్నికై…నెహ్రూ, శాస్త్రి లాంటి నాటి కాంగ్రెస్ అగ్ర నాయకుల అభిమా నాన్ని చూరగొని, తర్వాత ఇందిరా గాంధీ, పి.వి. నరసింహా రావు లాంటి ప్రధానులకు చేరువై, మహిళా పక్షపాతిగా పేరెన్నిక గన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ డిపాజిట్ రాని, ఒకనాటి కమ్యునిస్టు కంచుకోట అయిన ఖమ్మం నుండి లోక సభకు పోటీ చేసి తొలి విజయం నమోదు చేసి, అదే ఊపులో మరో రెండు సార్లు విజయ దుందుభి మోగించి కాంగ్రెస్ జెండాను రెపరెప లాడించిన రికార్డు ఆమెదే.

ఆమె రాజకీయ ఆరంగేట్రం ఎలా జరిగింది అంటే…1957లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కాంగ్రెస్ పార్టీని అడిగిన సందర్భంలో ఆమె భర్త ఒక ప్రభుత్వ అధికారి అయిన కారణం తో, ఆమెకు టికెట్ నిరాకరించారు. తాను ముందుగా భారత పౌరురాలినని, తర్వాతే అధికారి భార్యనని వాదించి, లాల్ బహదూర్ శాస్త్రిని మెప్పించి ఒప్పించి ఖమ్మం లోకసభ స్థాన టికెట్ పొందారు.

అసలు కాంగ్రెస్ కు అంతకుముందు డిపాజిట్లు కూడా దక్కని సీటులో ఆమె పోటీ చేయడం, గెలవడం ఏమిటని చర్చల నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి, ఔరా అనిపించి ఆ సీటులో గెలిచి చూపించారు తేళ్ల లక్ష్మీకాంతమ్మ.
1957, 1962, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లోనూ లక్ష్మీకాంతమ్మ వరుసగా మూడుసార్లు ఖమ్మం ఎంపీగా గెలిచారు. నెహ్రూ ప్రభు త్వంలో పార్లమెంటు కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. అలాగే ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించి, అప్పటిదాకా సివిల్స్ లో మహిళ లకు ప్రవేశం లేని స్థితిలో, ఇందిరా గాంధీని ఒప్పించి సివిల్స్ లో మహిళ లకు అవకాశం లభించేలా చేశారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు కోసం పార్లమెంటులో అనేక సార్లు మాట్లాడారు. 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యురాలిగా మహిళలు, యువకులకు ఎక్కువ టిక్కెట్లు వచ్చేలా కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన
తేళ్ల లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని కమ్మ భూస్వా ముల కుటుంబానికి చెందిన వెంకట్ రెడ్డి – మంగమ్మ దంప తులకు జన్మించారు. 5వ తరగతి వరకు కర్నూలులో చదివి, గుడివాడలో ఎస్ఎస్ఎల్‌సీ, ఇంటర్మీడియట్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో, మచిలీ పట్నంలో బిఏ, బెనారస్ హిందూ విశ్వ విద్యా లయం నుండి 1971లో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ పట్టా పొందారు. ఆమె 1944, నవంబరు 1న అనంతపురం జిల్లా అటవీ అధికారి టి.వి.సుబ్బారావును వివాహం చేసుకున్నారు.

లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నియోజక వర్గం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962లో, ఆ తర్వాత ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో పార్లమెంటు బృందంలో సభ్యురాలిగా ఆస్ట్రేలియా పర్యటించారు. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షా ఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించారు.
తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావడంలో తేళ్ల లక్ష్మీకాంతమ్మ పాత్ర కీలకమని తన జీవిత చరిత్రలో చెప్పుకున్నారు దివంగత రాష్ట్రపతి వి.వి.గిరి. ఇందిరాగాంధీకి ఆమెతో ఉండిన సాన్నిహిత్యం దృష్ట్యా, ఎన్నిసార్లు అడిగినా కేంద్ర మంత్రి పదవి స్వీకరించ లేదని, ఒక దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఇందిరా గాంధీ ప్రతిపాదించినా, ఆమె అంగీక రించక, మేధావి, అనుభవజ్ఞుడు అయిన పీవీ అయితేనే బాగుం టుందని చెప్పారని, పీవీ నరసింహా రావు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మీ కాంతమ్మ ఒక విధంగా కారణమని ఆ రోజుల్లో చెప్పుకునే వారు.

ఇందిరాగాంధీకి అంత సన్నిహి తురాలు అయినా, ఇందిర విధించిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించి, లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ ను వీడి, జనతాపార్టీలో చేరి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. హైదరాబాద్ లో హిమా యత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ లో బీహెచ్ఈఎల్, కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడంలో ఆమెది కీలక పాత్ర అని చెబుతుంటారు. 2007 డిసెంబర్ 13న 83 ఏళ్ల వయసులో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...