5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalSunrise Sunset సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదంటే... -...

Sunrise Sunset సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదంటే… – what to do and what not to do during sunrise and sunset time in telugu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

Sunrise Sunset ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటారు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలోనే కొన్నిసార్లు తెలిసో లేదా తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటి పనులు పరోక్షంగా మన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. దీంతో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే హిందూ మతం ఆచారాల ప్రకారం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులను చేయాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. ఈ సందర్భంగా సూర్యోదయం, సూర్యా్స్తమయం వేళ ఏ పనులు చేయాలి.. ఏ పనులను చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…Shukra Gochar 2023 కర్కాటకంలో శుక్రుడి సంచారం వేళ ఈ 4 రాశుల వారికి ఖర్చులు పెరుగుతాయట..!

sunrise in India

1)
వెలుతురు ఉండేలా చూసుకోండి..
హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా ప్రతిచోటా కాంతి ఉండేలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

సూర్యుడిని పూజించాలి..
వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుడికి నమస్కారం చేయడం అంటే సూర్యాస్తమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు.

డబ్బుకు లోటు రాకూడదంటే..
శాస్త్రాల ప్రకారం, పూజా గదిలో అంటే దేవుని గదిలో సూర్యాస్తమయం సమయంలో క్రమం తప్పకుండా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు అనేదే ఉండదు.

Budhaditya Raja Yog నేటి నుంచి బుధాదిత్య రాజ యోగం.. ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు..!

హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో, మన పూర్వీకులకు నమస్కరించాలి. వారి ఫోటోల ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ సమయంలో మీకు ఎదురయ్యే సంక్షోభాలన్నీ తొలగిపోతాయి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు. ఈ సమయంలో మీరు నిద్ర పోతే, వెంటనే లేవండి. సూర్యాస్తమయంలో నిద్రిస్తే.. ఆ ఇంట్లో పేదరికం వస్తుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, మీరు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగొచ్చినప్పుడు మీరు మీతో ఏదైనా తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Religion News and Telugu News

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments