1996 Dharmapuri Review :
శతాధిక వత్సరాల తెలుగు సినిమా చరిత్రలో
తెలంగాణ ప్రాంత నేపథ్యంగా వచ్చిన సినిమాలు బహు అరుదు. అందునా తెలంగాణ భాష, యాస, సంఘటనలు, ప్రాంతీయ దృశ్యాలు కలగలిపి తీసిన చిత్రాలు వేలల్లో ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం… దక్షిణ కాశీగా, నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా, హరిహర క్షేత్రంగా పేరుగాంచి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల నిలయంగా పేరుగాంచి, పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన పౌరాణిక చారిత్రక, ఐతిహాసిక ప్రాధాన్యత సంతరించుకున్న ధర్మపురి క్షేత్రం పేరుతో సినిమా విడుదల కావడం అరుదైన అపురూప విషయమే. 1996 ధర్మపురి పేరుతో సినిమా విడుదల కావడం విశేషమే.
1996 Dharmapuri Review :
గ్రామీణ సహజసిద్ద దృశ్యాల నేపథ్యంలో చిత్రీకరణ జరగడం, ప్రధాన పాత్ర లు మినహా, చాలా వరకు ధర్మపురి ప్రాంత వాసులకే ప్రాధాన్యత ఇచ్చి, అధికులకు చోటు కల్పించి, చిత్ర నిర్మాణం జరిగిన క్రమంలో, చిత్రం విడుదల చేయడంతో ధర్మపురి, పరిసర ప్రాంత వాసుల్లో అవధులు లేని ఆనందం చోటు చేసుకుంది.
శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు. ఓషో వెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఒక పల్లెటూరులో ఊరి సర్పంచ్ కు నమ్మిన బంటుగా ఉంటూ, వారి ఇంటిలో, జీతగానిగా ఉన్న హీరో, అదే ఊర్లో బీడీ కంపెనీలో జీవనోపాధి కోసం బీడీలు చుట్టే, ఇరువురు పేద కుటుంబాలకు చెందిన ప్రేమికుల యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. ధర్మపురి మండలంలోని రాజవరం గ్రామం… ఆ గ్రామంలోని భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపమైన పాత గడీ ప్రధాన కేంద్రంగా, ధర్మపురి క్షేత్రం లోని దేవస్థానం, గోదావరి తీరం, బ్రహ్మ పుష్కరిణి… దమ్మనపేట , తుమ్మెనాల గ్రామాల ఇళ్ళు, వీధులు, పరిసరాలు, చెట్లు చేమలు, చెరువులు, గట్లు… ఆ ప్రాంత లోకేషన్స్ నూటికి నూరుపాళ్లు సహజ సిద్ధమైన దృశ్యాల చిత్రీకరణ జరగడం ఈ చిత్ర ప్రత్యేకం.
ఇటీవలే ప్రముఖ సినీ దర్శకుడు మారుతి విడుదల చేసిన ట్రైలర్, ట్రైలర్లో డైలాగుల క్రమంలో
చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ముందస్తు చిత్ర విడుదల కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ప్రముఖ దర్శకుడు మారుతి, మైత్రి మూవీ మేకర్స్ రవి, నిర్మాత యస్.కె.యన్, నటుడు జీవి నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, డార్లింగ్ స్వామి తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొ నడం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… పుణ్యక్షేత్రంా ప్రత్యేకత కలిగిన ధర్మపురి క్షేత్రం పేరుతో సినిమా తీయడం,
గ్రామీణ వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేయడం ద్వారా సినిమా రావడం చాలా సంతోషంగా ఉందని అభినందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు.
దేవస్థానంలో సినీ దర్శకుడు జగత్ పూజలు
ఏప్రిల్ 22న ఉభయ తెలుగు రాష్ట్రాలలో 125కు పైగా సినిమా థియేటర్లలో విడుదల చేసిన సందర్భంలో ఈ సినిమా దర్శకుడు జగత్ ధర్మపురి క్షేత్రం లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో లక్ష్మీ నరసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయ వంతం కావాలని ప్రార్థించారు.
ధర్మపురి చంద్ర టాకీస్ లో చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు
ధర్మపురి పట్టణంలోని చంద్ర సినీమా థియేటర్ లో…
చిత్ర దర్శకుడు జగత్ 1996 Dharmapuri సినిమా విడుదల సందర్భం లో సినిమాను ఆసాంతం చూశారు. టాకీస్ యజమాని కస్తూరి రాం కిషన్ సన్మానాన్ని అందుకుని, సినిమాలో నటించిన కొందరు, మీడియా ప్రతినిధులతో కలిసి చిత్రానికి తిలకించారు. ఈ సందర్భంగా దర్శకుడు
మారుతి మాట్లాడుతూ… రియలిస్టిక్ కథతో సినిమా తీయడం, ఈ చిత్రానికి శేఖర్ మాస్టర్ సమర్పణ చేయడం చాలా హెల్ప్ అయ్యిందన్నారు. 1996 ధర్మవురి చిత్రాన్ని చూసేవారు కచ్చితంగా థ్రిల్ పీలవుతారని, నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారని, ఓషో వెంకటేష్ సంగీతం చాలా బాగుందని, తీసిన చిత్రం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
