జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం ఉదయం వెంకీ..పింకీ.. జంప్ సినిమా షూటింగులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్లు పాల్గొన్నారు. మంత్రి మొదటి షాట్ కోసం క్లాప్ కొట్టగా, ఏంపీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీ నర్సింహా ఫిలిమ్స్ ఆధ్వర్యంలో నిర్మాత వెంకట్, అజయ్ నతారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొత్తం తెలంగాణ యాస, భాషలో మీ ముందుకు రానున్నదని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. రెండు నెలల పాటు సిద్ధిపేట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరగనున్నదని, కళాంజలి రాజేష్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న చిత్రాన్ని తెలంగాణ సమాజం ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, హీరో విక్రమ్, హీరోయిన్లు, ఇతర నటీనటులు పాల్గొన్నారు.
వెంకీ..పింకీ.. జంప్ సినిమా షూటింగులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES