Wednesday, November 30, 2022
Homespecial Editionఅలనాటి ఆకాశవాణి మేటి గాయకురాలు గోపాలరత్నం

అలనాటి ఆకాశవాణి మేటి గాయకురాలు గోపాలరత్నం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

శ్రీరంగం గోపాలరత్నం ఆకాశవాణి ద్వారా సమర్పిత భక్తిరంజని ద్వారా శ్రోతల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అలనాటి మేటి సంగీతజ్ఞుులు. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభల ద్వారా, భక్తిరంజని ద్వారా, రేడియో నాటకాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు చిర పరిచితులు, విజయవాడ కేంద్రంలో దాదాపు 20 సంవత్సరాలు స్టాఫ్ ఆర్టిస్టుగా పని చేశారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసి సికిందరా బాదు సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు.

శ్రీరంగం గోపాలరత్నం (1939 – మార్చి 16, 1993) అలనాటి ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు. కూచిపూడి, యక్షగాన, జావళి, యెంకి పాటలు పాడడంలో ఆమెది అందె వేసిన చేయి. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఆమె ఆల పించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. 1992 లో ఆమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఆమె Srirangam Gopalaratnam 1939 సంవత్సరంలో విజయ నగరం జిల్లా పుష్పగిరిలో వరదా చార్యులు, సుభద్రమ్మ దంపతు లకు జన్మించారు. ఆమె 1956లో సంగీతంలో డిప్లొమా తీసు కున్నారు . తల్లికి మేనమామ అయిన అప్ప కొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడం ద్వారా ప్రదర్శనలను ప్రారంభించారు. కవిరాయని జోగారావు ఆమెకు ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు.

తొలిసారిగా విజయవాడ ఆకాశ వాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటి నుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖు లతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమా లను సమర్పించారు. ఆమె కంఠం నుంచి అలవోకగా జాలువారిన అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు శ్రోతల హృదయాలలో చెరగని ముద్రలు వేశాయి. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచా యి. ఆమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం మీరాబాయి.

ఆల్ ఇండియా రేడియోలో భక్తిరంజని కార్యక్రమాల్లో ఆమె భాగస్వామ్యం ఎన్నదగినది. అన్నమా చార్య కీర్తనలకు బాణీలు సమకూర్చారు.
శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంలోని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా పాట యావత్ ఆంధ్రదేశం వ్యాపించింది. ఈ గీతాన్ని రచించినది ఏడిద కామేశ్వర రావు. తిరుమల తిరుపతి దేవస్థానం 60లలో నిర్మించిన “శ్రీ వేంకటేశ్వర వైభవం” డాక్యుమెంటరీ చిత్రంలో ఈ పాటను ఉపయోగించారు. ఈ పాటను మోహన (హిందూస్తానీ: భూపాలీ) రాగం, తిశ్రగతి తాళంలో
ప్రముఖ కర్ణాటక, లలిత సంగీత గాయని కుమారి శ్రీరంగం గోపాల రత్నం గానం చేయగా అనూహ్య ప్రజా దరణ పొందింది. బికారి రాముడు చిత్రంలో ఆమె పాడిన నిదురమ్మా నిదురమ్మా గీతం బహుళ పాచుర్యం పొందింది. సుబ్బశాస్త్రి’ (1966) సినిమాలోని శ్రీరంగంలోని ప్రసిద్ధ కన్నడ సినిమా పాట కృష్ణాన కొలలిన కరే… అయిదు దశాబ్దాల తర్వాత కూడా కర్ణాటక అంతటా ప్రసిద్ధి చెందింది.
మ్యూజిక్ ఎకాడమీ మదరాసులో 1960 దశకంలో పలు మార్లు పాడారు. శ్రీరంగం శాస్త్రీయ సంగీతం పాడినా, లలిత సంగీతం పాడినా, భక్తి గేయం పాడినా, నాటక, నాటికల్లో పద్యం చదివినా ఏ పాటైనా చివరకు మంగళ హారతి పాడినా పూర్తిగా అంకితమై, మమే కమై న్యాయం చేకూర్చే వారు. మైసూరు, బెంగుళూరు, కలకత్తా, నాగపూరు, సేతూర్ (కేరళ) తదితర పట్టణాలలో బహు కచేరీలు చేశారు. తిరువ య్యూరులో త్యాగ రాజోత్సవ ములో … శ్యామ శాస్త్రులవారి గృహంలో కూర్చొని పాడినపుడూ ఓ రానుభూతి పొందానని చెపుతుండే వారు. కచేరీ జరుగుతుండగా ఉత్సాహం పట్టలేక 94 సంవత్సరాల సేకూర్ జమీందారు కంజీరా తీసికొని వాక చేరికి వాయించిన సందర్భం అనందభరితురాల్ని చేసిందని పదేపదే గుర్తు చేసుకుంటుండే వారు.

ఆమె ఆకాశవాణి కళాకారిణిగా, హైదరాబాద్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా, తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1969లో తిరుమల – తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసు రాలిగా సేవలందించారు. 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిణి గా
నియమితు లయ్యారు. ఆమె గాన కోకిలగా, సంగీత కళానిధిగా, సంగీత రత్నగా గుర్తింపు పొందారు. ఆమె 1979 మరియు 1980 మధ్య విజయ నగరం మహారాజా ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాల ప్రిన్సి పాల్‌గా పనిచేశారు.1992లో భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’ గౌరవంతో సత్కరించింది. గానకళా తపస్విని గోపాల రత్నం 1993 మార్చి 16న పరమ పదించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments