5.1 C
New York
Thursday, June 1, 2023
HomeNews"రాగ‌ల 24 గంట‌ల్లో".. స‌క్స‌స్ మీట్ లో "భార్య‌దేవోభ‌వ" సినిమాని ఎనౌన్స్ చేసిన శ్రీనివాస‌రెడ్డి _Ts360News.com

“రాగ‌ల 24 గంట‌ల్లో”.. స‌క్స‌స్ మీట్ లో “భార్య‌దేవోభ‌వ” సినిమాని ఎనౌన్స్ చేసిన శ్రీనివాస‌రెడ్డి _Ts360News.com

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

సత్యదేవ్‌, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్రాన్ని ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు.

 శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై శ్రీనివాస్ కానూరి ఈ సినిమాని నిర్మించారు.  వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్ ఇటీవ‌ల రిలీజైంది.

రోజురోజుకు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రాగ‌ల 24 గంట‌ల్లో టీమ్ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది.  

ఈ వేడుక‌లో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని అద్భుతంగా రీసీవ్ చేసుకున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే న‌మ్మారో అదే జ‌రిగింది.

స్టోరీ, ప‌ర్ ఫెర్మాన్స్,  అంజి గారి కెమెరా వ‌ర్క్, ర‌ఘు కుంచె మ్యూజిక్, మంచి క్వాలీటీతో రాజీప‌డ‌కుండా మా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాని నిర్మించ‌డం… ఇవ‌న్నీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కార‌ణం.

ఈషా రెబ్బా అద్భుతంగా న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఈషాకు కంగ్రాట్స్ చెబుతున్నాను. న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూస‌ర్ గార్కి, డైరెక్ట‌ర్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

అనురాగ్, అజ‌య్, గ‌ణేష్, వంశీ…ఇలా ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా న‌టించారు. అంద‌రూ బాగా న‌టించారు కాబ‌ట్టే వండ‌ర్ ఫుల్ హిట్ వ‌చ్చింది.

ఈ సినిమాని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కి చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించిన మా పీఆర్వోస్ వంశీ – శేఖ‌ర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను.

రఘు అన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది అని అంద‌రూ మాట్లాడుతుంటుంటే చాలా ఆనందంగా ఉంది. త‌మ్మిరాజు గారు ఎడిటింగ్ సూప‌ర్. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా అద్భుతంగా ఎడిట్ చేసారు.

ఈ సినిమాని చూడ‌ని వాళ్లు త‌ప్ప‌కుండా థియేట‌ర్ లో చూడండి అన్నారు.

న‌టుడు ర‌వివ‌ర్మ మాట్లాడుతూ… థ్రిల్ల‌ర్ సినిమా అన‌గానే ఏ సెంట‌ర్ మూవీ అనుకుంటారు కానీ.. మా సినిమా సి, బి సెంట‌ర్స్ లో కూడా చాలా బాగా ఆడుతుంది. ఈ సినిమాకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి థియేట‌ర్ల‌ను కూడా పెంచుతున్నారు. స్క్రీన్ ప్లే, ట్విస్టులు…ఇలా అన్నీ క‌రెక్ట్ గా కుదిరాయి.

మేము మాట్లాడింది నిజ‌మో కాదో సినిమా చూసాకా ప్రేక్ష‌కుల‌కు తెలుస్తుంది. అమెజాన్ లో చూద్దాం అనుకోకండి. థియేట‌ర్ లోనే చూడండి. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కి ర‌ప్పించాలంటే చాలా క‌ష్టం. అయితే.. మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

థియేట‌ర్ లో కూర్చొని సినిమా చూస్తే… ఆ కిక్కే వేర‌ప్పా. ఈ సినిమాని చూసిన ప్రేక్ష‌కులు సినిమా బాగుంది అని ప‌ది మందికి చెబుతున్నారు.

మంచి రివ్యూస్ వ‌చ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్… ఇలా అన్ని డిపార్టెమెంట్స్ గురించి రాసారు. రివ్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అంద‌రూ థియేట‌ర్ లో చూడాల‌ని కోరుతున్నాను అన్నారు.

కెమెరామెన్ అంజి మాట్లాడుతూ... శ్రీనివాస‌రెడ్డి కామెడీ సినిమాలు తీసాడు. సోషియో ఫాంట‌సీ ఢ‌మ‌రుకం తీసాడు. థ్రిల్ల‌ర్ మూవీని ఎలా తీస్తాడు అని చాలా మంది మిత్రులు అడిగారు.

ఈ థ్రిల్ల‌ర్ మూవీని కూడా శ్రీనివాస‌రెడ్డి గారు అద్భుతంగా తీసారు. స‌త్య‌దేవ్ నెగిటివ్ రోల్ లో అద‌ర‌గొట్టేసాడు అని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

మ‌ల్లిఖార్జున థియేట‌ర్ లో ఈ సినిమాని చూసాను. ప్రేక్ష‌కులు క్లాప్స్ కొడుతుంటే.. మా క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం వ‌చ్చింద‌ని చాలా హ్యాపీగా అనిపించింది. మా నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మించారు. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

న‌టుడు గ‌ణేష్ వెంక‌ట్రామ‌న్ మాట్లాడుతూ… టీమ్ వ‌ర్క్ లా ఈ సినిమాకి వ‌ర్క్ చేసాం. ఈ రోజు సినిమా స‌క్స‌స్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది.

ఢ‌మ‌రుకం త‌ర్వాత మ‌ళ్లీ శ్రీనివాస‌రెడ్డి గారి సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. స‌త్య‌దేవ్, ఈషా అద్భుతంగా న‌టించారు.

 ర‌ఘు మ్యూజిక్, అంజి కెమెరా వ‌ర్క్, త‌మ్మిరాజు ఎడిటింగ్.. ఈ సినిమాకి ప్ల‌స్ అని చెప్ప‌చ్చు. ఫ్యామిలీతో అంద‌రూ ఈ సినిమాని చూడండి అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ మాట్లాడుతూ… ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో మేఘ‌న క్యారెక్ట‌ర్ చేసాను.

కెమెరామ‌న్ అంజిగారు న‌న్ను మ‌రింత అందంగా చూపించినందుకు థ్యాంక్స్. స‌త్య‌దేవ్, ఈషా, ర‌ఘు గారి మ్యూజిక్, ఎడిటింగ్…

ఇలా అన్నీ బాగా కుదిరాయి. ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే ఈ స‌క్స‌స్ వ‌చ్చింది అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరి మాట్లాడుతూ… డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి సినిమా బాగుంది. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి అని మెసేజ్ లు రావ‌డంతో చాలా సంతోషంగా ఉంది.

మంచి సినిమాని ఇచ్చిన శ్రీనివాస్ అన్న‌య్య‌కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. కొంత మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా సినిమా బాగుంది అని అభినందించారు. రాఘ‌వేంద్ర‌రావు గారు ఫోన్ చేసి…

శ్రీనివాస‌రెడ్డి థ్రిల్ల‌ర్ మూవీని ఎలా తీస్తాడో అనుకున్నాను. చాలా గ్రిప్పింగా తీసాడు బాగుంది అని అభినందించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి.

సినిమా బాగుంది అని సి.ఎం ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వ‌చ్చింది. ఇంత మంది ఇలా అభినందిస్తుంటే…

నా ఆనందానికి అవ‌ధులు లేవు. ఈషా, స‌త్య వీరిద్ద‌రు తెలుగువాళ్లు. తెలుగు న‌టీన‌టుల‌తో ఈ సినిమా చేయ‌డం..

అది ఈ విధంగా విజ‌యం సాధించ‌డం… ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ… నా క్యారెక్ట‌ర్ బాగుంది.. బాగా చేసావ్ అంటూ అంద‌రూ అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ఎ టు జెడ్ బాగుంది అని అంటున్నారు అంటే దానికి కార‌ణం మా డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి గారు,

నిర్మాత శ్రీనివాస్ గారు. వాళ్లిద్ద‌రి డ్రీమ్ ఇది. మా శ్రీనివాస్ గారు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ర‌ఘు గారి మ్యూజిక్, అంజి గారి సినిమాటోగ్ర‌ఫీ బ్యాక్ బోన్ అని చెప్ప‌చ్చు.

స‌త్య నెగిటివ్ రోల్ లో యాక్టింగ్ చించేసాడు. ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఫ్యామిలీతో చూడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ…. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో త‌ర్వాత కొంత నిరాశ‌కులోన‌య్యాం. శ‌నివారం మార్నింగ్ షో,

మ్యాట్నీ షోలు హౌస్ ఫుల్ అవ్వ‌డం.. అన్ని చోట్లా క‌లెక్ష‌న్స్ బాగుండ‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం.

ఈ సినిమా చూసిన వాళ్లు బాగుంది చూడండి అని ఓ ప‌ది మందికి చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లు స‌త్య‌, ఈషా న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి మాట్లాడుతున్నారు. స‌త్య సినిమా ఇండ‌స్ట్రీకి ఓ వ‌రం.

ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని మంచి పాత్ర‌లు అత‌నికి వ‌స్తాయి. ఈషా అందంతో పాటు అభిన‌యంతో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆక‌ట్టుకుంది.

నేను ఏదైతే న‌మ్మి ఈ సినిమా తీసానో అది నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాకి రియ‌ల్ హీరో మా ప్రొడ్యూస‌రే. ద‌మ్మున్న నిర్మాత‌. క్వాలీటీ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ మూవీని నిర్మించారు.

300 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. పెద్ద సినిమాకి ఎలాగైతే ప‌బ్లిసిటీ చేస్తారో అలా చేసాం. బుధ‌వారం నుంచి స‌క్స‌స్ టూర్ ప్లాన్ చేస్తున్నాం.

వైజాగ్ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ టూర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్స్ కి వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లుస్తాం.

ర‌ఘు మ్యూజిక్, అంజి కెమారావ‌ర్క్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. కృష్ణ‌భ‌గ‌వాన్ డైలాగ్స్ సినిమా విజ‌యానికి హెల్ప్ అయ్యాయి. ఓ మంచి సినిమా తీసాన‌నే తృప్తి క‌లిగించింది.

ఇక త‌దుప‌రి చిత్రం గురించి చెప్పాలంటే… ఇదే బ్యాన‌ర్ లో అతి త్వ‌ర‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాను.

ఆ సినిమా టైటిల్ భార్య‌దేవోభ‌వ‌. ఇందులో ప్ర‌ముఖ హీరో న‌టించనున్నారు. ప‌ది మంది హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన్మెంట్ గా ఉంటుంది.

మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ వ‌లే.. భార్య గొప్ప‌త‌నం తెలియ‌చేసేలా భార్య‌దేవోభ‌వ ఉంటుంది.

పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments