Saturday, November 26, 2022
Homespecial Editionఅఖండ మహిమాన్వితుడు... శ్రీ గురు రాఘవేంద్రుడు

అఖండ మహిమాన్వితుడు… శ్రీ గురు రాఘవేంద్రుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే.

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671) హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఆయన వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఆయనను శిష్యగణం ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.

మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందు కుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచు కుంటారు. తమిళ నాడు లోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఆయన శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. పంచ ముఖిలో తపస్సు చేశారు. పంచ ముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. అక్కడే జీవ సమాధి పొందారు. శ్రీ రామవేంద్ర తీర్థ స్వామి విలక్షణ ప్రతిభగల, అద్భుత మహిమలు నెఱపిన మహ నీయుడు. ఆయన తుంగ భద్ర తీరమునందు మంత్రాల యము అను ప్రదేశములో శ్రావణ బహుళ ద్వితీయ నాడు (క్రీ.శ.1671) బృందావనములో ప్రవేశిం చారు. ఆ దినాన్ని స్వామి ఆరాధనా దినంగా జరుపు కుంటారు. రాఘవేంద్ర తీర్థస్వామి అన్నది ఆ వ్యక్తి సన్యాసాశ్రమపు నామము. పూర్వాశ్రమంలో ఆయన పేరు వెంకట భట్టు. తండ్రి పేరు వీర కృష్ణ భట్టు. తల్లి పేరు గోపమ్మ, ఆ దంపతులకు అతను చివరి కొడుకు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన వెంకటభట్టు చాలా తెలివైన వాడు. సంస్కృతంలో, కావ్యములు వేదాలు, మీమాంస మున్నగునవి ఆయన మధురకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహాచారి వద్ద చదువుకున్నారు. తాత శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకట నాథుడి బాల్యం లోనే తల్లిదండ్రులు గతిం చారు. బావగారైన లక్ష్మీనారాయణ చేర దీశారు. బావ పెంపకంలోనే వెంకట నాథుడు సర్వశాస్త్ర పారంగతు డయ్యారు.

విద్యాభ్యాసానంతరము సరస్వతి బాయిని వివాహం చేసుకుని, పేదరికం కారణంగా, తన కాపురాన్ని కుంభ కోణమునకు మార్చారు. అక్కడ శ్రీ మధ్వాచార మత గురువులలో ఒకరైన శ్రీ సుధీంద్ర తీర్థ స్వామి వారికి శిష్యుడయ్యారు. గురువు చెప్పగా శిష్యుడు వ్యాఖ్య వ్రాస్తూ ఉంటూ ఉండేవారు. ఒకనాడు ఒక ఘటం గురువుకే విడివడలేదు. ఆలోచించి రేపు చెబుతానని గురువు ఆనాటికి పాఠం చూపించారు. ఆ రాత్రి శిష్యుడు గురువుకు సందేహం వచ్చిన ఘట్టానికి సంబంధించిన వ్యాఖ్య తాను రచించి మరీ నిద్రపోయారు. మరునాడు గురువు శిష్యుని ఎంతగానో పొగడి, ఇతర శిష్యుల సమక్షంలో ‘పరిమళ ఆచార్య అను బిరుదం ఇచ్చారు.

కొన్నాళ్లకు శ్రీ సుధీంద్రతీర్థస్వామికి జబ్బు చేయగా, తనకు అవసాన కాలం సమీపించిన విషయం తెలుసుకుని, తన అనంతరం మధ్వ పీఠం నడవ డానికి వెంకట భట్టే తగిన వాడని నిర్ణయించారు. ఆజ్ఞాపూర్వకంగా గురువు చెప్పినది శిష్యుడు విన్నా, తనకు నడి వయస్సు భార్య యువతి, ముక్కు పచ్చలారని, ముద్దు కుమారుని కలిగి ఉన్న పరిస్థితులలో విచారించి, భగవత్ కైంకర్యంనకే తన భవిష్య జీవితాన్ని అంకితం చేయడానికి కృత నిశ్చయు డయ్యారు. సుధీంద్రులు వెంకట నాథుని తంజావూరు చెంతగల హనుమంత పురం లోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారు. దీక్షానామం “శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి” అనే పేరు స్వీకరించారు. కొద్ది కాలానికి అనంతరం సుధీంద్ర తీర్థస్వామి తనువు చాలించారు. శ్రీ రాఘవేంద్రుడు పీఠ అధిపతి అయ్యారు. ఆయన ప్రహ్లాదుని అపరావతారమని, అందువలన యెన్నో యోగ మహిమలు నెరపగలు గతున్నారని ప్రఖ్యాతి కలిగింది. కాలక్రమాన రాఘవేంద్ర స్వామి వృద్ధుడయ్యారు. భౌతిక కాయం బృందావనంలో ప్రవేశింప వలసిన కాలం వచ్చిందని తెలుసు కున్నారు.

ప్రహ్లాదుడు యాగం చేయడం చేత పవిత్రత కూర్చుకున్నదని ప్రఖ్యాతి గల మాంచాలి అనే గ్రామాన్ని స్వామి తన బృందావన స్థానంగా ఎంచుకున్నారు. ఆ గ్రామం తుంగ భద్ర తీరాన ఆదోని తాలూకా ఉత్తరపు కొనను ఉన్నది. గ్రామ దేవత పేరు మాంచాలమ్మ. మాంచాలమ్మ ఆలయాన్ని పట్టి ఆ ఊరికి మాంచాలి అనే పేరు వచ్చింది. స్వామి బృందావనం వెళ్ళాక, అక్కడికి వెళ్లిన రోగులు కుష్టు, మూగ, గుడ్డి మున్నగు దారుణ వ్యాధులతో బాధపడే వారు. మంత్ర ముగ్ధులయి రోగ నిర్ముక్తులు అవుతూ ఉండడం వల్ల దానికి మంత్రాలయం అనే పేరు వచ్చింది. ఆ గ్రామాన్ని నవాబు సిద్ధి మస్సానెత్‌ఖాన్‌, స్వామికి (మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ గెజిటీర్‌ పునర్ముద్రణ 1916 చాప్టర్‌ 15 ఆదోని తాలూకా పేజీ 213) శ్రోత్రియంగా ఇచ్చారు. మద్రాసు గవర్నర్‌ ధామస్‌ మన్రోకు రాఘవేంద స్వామి చూపిన అద్భుతాలు బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. అలా రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి. వెంకన్న పంతులు విశేష ధనం వెచ్చించి అక్కడ స్వామి బృందావనానికి ఏర్పాట్లు చేసి గుళ్లు గోపురాలు కట్టించారు.

రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యత లు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి వెళ్లి వచ్చి, మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. అసమాన శేముషీ దురంధరుడైన రాఘవేంద్రు నికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రం లో ఆయన ప్రజ్ఞా పాటవా లకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో సన్మానించారు.

ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపు రూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించారు.

ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటా నని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందడానికి సంసిద్దు డైనాడు. క్రీస్తుకు 1671 వ సంవత్స రం శ్రావణ బహుళ ద్వితీయ గురువారం నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ప్రవేశించారు. వేదమంత్ర పఠనం జరుగుతూ ఉండగా స్వామి అందులో కూర్చున్నారు. అక్కడ చేరిన వేలకొలది భక్తులు హరినామ కీర్తన సాగిస్తూ ఉండగా స్వామి నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించారు. శ్వాసని నిలిపివేసి మనోలయం చేశారు. గండకీ నది నుంచి తెప్పించిన 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసి వేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహి స్తానని ఆయన ప్రకటన చేశారు. శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయం లోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహి త్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.

బ్రతికి ఉండగా జరిపిన అద్భుత మహిమలు స్వామి బృందావనంలో ప్రవేశించాక కూడా చేస్తూ వచ్చారు. చేస్తూరావడం చేతనే మంత్రాల యంలో శ్రావణ బహుళ ద్వితీయ ఏటేట గొప్ప తీర్థదినమై వరలుతూ ఉంది. మధ్వమత స్థులేకాక లింగాయతులు మున్నగు భిన్న మతస్థులు కూడా ఈ తీర్థానికి విశేషంగా వస్తారు. తీర్థం మూడు రోజులు సాగుతుంది. స్వామి తీర్థంతో పాటు గ్రామదేవత సంబంరం కూడా సాగుతోంది.

మహిమాన్వితు లైన రాఘవేంద్ర స్వామి జయంతి వేడుకలు ఆరు రోజుల పాటు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. 4న రాఘవేంద్ర స్వామి వారు సన్యాసం స్వీకరించిన రోజు కావడంతో స్వామి వారి మూల బృందావనానికి పంచా మృతం అభిషేకాలు, విశేష పూజ లు నిర్వహించారు. తిరుమల తిరు పతి దేవస్థానం పక్షాన అదనపు ఈఓ ధర్మారెడ్డి దంపతులు వారు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

401వ పట్టాభిషేకం సందర్భంగా మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు స్వామి వారిని పాదుకలకు నవరత్నాలు, పుష్పాలతో ప్రత్యేక పూజలు, 9వ తేదీ రాఘవేంద్ర స్వామి 427వ జన్మదినం సందర్బం గా మూల బృందావనానికి పంచా మృతం అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. తమిళనాడుకు చెందిన నాదహారా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది విద్వాం సులతో నాదహారా సమర్పణ సేవా కార్యక్రమం, మధ్యాహ్నం శ్రీరాఘ వేంద్ర స్వామి ప్రతిమను స్వర్ణ రథోత్సవంలో ఆశీనులను చేసి శ్రీమఠం ప్రాకారం లో ఊరేగింపుతో గురు వైభవోత్స వాలు ముగిసాయి. రాఘవేంద్ర స్వామి 427వ జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రామకృష్ణ దంపతులు రూ.50 లక్షలు విలువజేసే నవరత్నాల హారాన్ని విరాళంగా ఇచ్చారు. నవ రత్నాల హారాన్ని మఠం పీఠాధి పతులు సుభుదేంద్ర తీర్థులుకి అందజేశారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments