5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleDevotionalతెలుగునేలపై శైవమత వ్యాప్తి

తెలుగునేలపై శైవమత వ్యాప్తి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్ట్రకూట, కాకతీయ, అనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిడవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే తెలుగు నేలలో శైవారాధన ఉంది. గాథా సప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు. చేతికందుతున్న చరిత్ర ఆధారంగా శ్రీముకుడు కాణ్వ రాజైన సుశర్మను వధించి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, వివిధ చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి, శ్రీ.పూ.1వ శతాబ్దిగా స్పష్టమవుతున్నది. శ్రీముకుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. శాతవాహన 17వ రాజైన హాల చక్రవర్తి, సింహళ రాకుమారి లీలావతిని సప్త గోదావరీ తీరస్థ భీమేశ్వరాలయం, నేటి జగిత్యాల జిల్లాలోని వేంపెల్లి వెంకటరావుపేటలో వివాహ మాడినట్టు నాటి భీమేశ్వరాలయం ఉన్నట్లు నిరూపితమైంది.

బౌద్ధమతంలోనూ నాగదేవత అరాధన ఉంది. స్థూపాలను పెనవేసుకున్న నాగ సర్పాల చిత్రాలు ప్రధానంగా ధూళికట్ట స్థూపంపై ఐదుతలల నాగ ముచిలింద శిల్పాన్ని చూడవచ్చు. ఇక్ష్వాకు (క్రీ.శ.253–277) రాజైన ఎహువల శాంతమూలుని సేనానియైన ఎలిశ్రీ ఏలేశ్వరం నిర్మించి, సర్వదేవాలయమనే శివాలయాన్ని నిర్మించాడు. ఆయన కాలంలో విజయపురిలో కార్తికేయ, పుష్పభద్ర స్వామి, నోడిగిరీశ్వర, దేవీ ఆలయాలు నిర్మితాలై నాయి. ఇక్ష్వాకుల కాలంలో మాతృ దేవతారాధన కూడా ఉండేది. నాగార్జున కొండలో హరీతి ఆలయం నిర్మించ బడింది.
ఆలయంలో సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించే వారని శాసనాధారం. వీరికాలంలో స్కంద గణపతి, యక్షుడు, హరీతి దేవత లను పూజించేవారు. అనంతర వాకాట రాజులలో అధికులు శైవులు. మొదటి రుద్ర సేనుడు మహా భైరవుని భక్తుడు కాగా, మొదటి పృధ్వీసేనుడు మహేశ్వర భక్తుడు. క్రీ.శ.358నుండి 569వరకు 210 ఏళ్ళు తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించిన విష్ణుకుండినులు నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ (అమల పురం), నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం లోని ఇంద్రపాల నగరం. కొంతకాలం బెజవాడను రాజధానిని చేసుకున్నారు. వీరు బ్రాహ్మణ మతావ లంబులు, శివభక్తులు. రెండవ మాధవవర్మ (క్రీ.శ.440-495) 100కుపైగా యుద్ధాలు చేసి, విజయాలు సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్టపైన ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. విజయం సాధించిన చోటల్లా రామలింగేశ్వర ఆలయం కట్టించాడు. శ్రీశైలం మల్లికార్జునునికి చంద్రగుప్తుడు అనే రాజు బంధువైన చంద్రవతి ప్రతి ష్టించినదని చెపుతున్న గుప్త మహేశ్వర ఆలయ శిథిలాలు, నేటికీ శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమా మహేశ్వరానికి ఉత్తరాన ప్రతాప రుద్ర కోటకింద వాయవ్య మూలన రోడుకు దక్షిణాన ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినుల కాలంలోనే బహుళ ప్రచారం పొందాడు. గోవింద వర్మ అనేక దేవాలయాలు కట్టించాడు. 2వ మాధవ వర్మ అనేక రామ లింగేశ్వరాలయాలు కట్టించాడు. గుంటూరు జిల్లా లోని సత్తెనపల్లి తాలూకా వేల్పూరులో, ఈ ఊరులో, కీసరగుట్టలో రామలింగే శ్వరాలయాలు నేటికీ దర్శనీయ స్థలాలే. తూర్పు చాళుక్య 2వ విజయాదిత్యుడు 108 విజయాలకు గుర్తుగా 108 భీమేశ్వరాలయాలు నిర్మించాడు. జైన మతం విష్ణుకుండినుల కాలంలోనే దాదాపు కనుమరుగు కాగా, జైన ఆలయాలు శివాలయాలైనాయి. అలంపురం విష్ణుకుండినుల కన్నా ముందువారైన ఇక్ష్వాకుల నుంచే మనుగడలో ఉండేదని శాసనాధా రంగా ఉంది. వేములవాడ చాళుక్యులు, వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం తెలంగాణ లోని ప్రముఖ శివాలయం. బద్దెగ (క్రీ.శ.850-895) వేములవాడలో బద్దిగేశ్వర (భీమేశ్వర) ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.7వ శతాబ్ది శాసనంలో శివమండల దీక్ష ప్రసక్తి ఉంది. శ్రీశైలం, అలంపురం, బెజ వాడ, పిఠాపురం నాటి శక్తి పూజా కేంద్రాలు.

బసవేశ్వరుడు (క్రీ.1100-70) వీర శైవోద్యమాన్ని ప్రారంభించాడు. అనంతరం మల్లికార్జున పండితుడు శైవాన్ని ప్రచారం చేశాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం నిర్మించాడు. భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్య నిర్మాణాలే. యుద్ధ మల్లుడు బెజవాడలో కుమారస్వామి, 2వ విక్రమాదిత్యుని భార్య మహాదేవి, పట్టడకల్ లో శైవాలయాన్ని నిర్మించారు. రాష్ట్రకూటుల కాలంలో ఎల్లోరా గుహలు మలుచ బడ్డాయి. కైలాసనాథ ఏక శిలాలయం మొదటి కృష్ణుని అద్భుత సృష్టి. కాలాముఖి, కాపాలిక తెగలు ప్రచారం లోకి వచ్చాయి. కాకతీయులు కాకతి మాతృదేవతారాధకులుగా అభిప్రాయాలున్నాయి. గ్రామదేవత యైన ఏకవీర ఆరాధన నాడు బహుళ ప్రచారంలో ఉంది. వీరికాలంలో జైన బౌద్ధ, వీరశైవుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు భిన్నంగానే తిక్కన హరిహర తత్వాన్ని బోధించాడు. కాళేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసింది 2వ ప్రోలరాజు గురువైన రామేశ్వర పండితుడు. కాకతీయ పరిపాలనలో ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నందికంది, శనిగరం, పుష్పగిరి, అమరావతి, సామర్లకోట, భీమ వరం, పాలకొల్లు, ద్రాక్షారామం గొప్ప శైవక్షేత్రాలు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో కాకతీయుల కాలంలో 5500 శైవాలయాలు, 1300 వైష్ణవాల యాలు, 2400 మల్లారదేవుని గుళ్ళు…భైరవ, దుర్గ గణపతి దేవుళ్ళవి కలిపి 4400 గుడులు ఉండేవని స్పష్టమవు తున్నది. వెలమరాజుల కాలంలో కాళిక, దుర్గ, చండి, భద్రకాళి, మహిశాసుర మర్ధిని, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకవీర దేవతల ఆరాధన ఉన్నట్లు తెలుస్తున్నది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments