తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయాన ఆపన్నులకు ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సహకారం అందించడంలో అసమాన సేవలు అందించిన వారి సేవలకు గుర్తింపుగా ఉగాది సంబరాల సందర్భంగా తమ చారిటే బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కార, సన్మాన కార్యక్రమాలు చేపట్టడం అమితానంద దాయకమని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎల్ ఎం కొప్పుల స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన 2వ రోజు జిల్లా కలెక్టర్ రవి గుగులోత్, ఎస్పీ సింధు శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కరోనా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ సిబ్బందికి తమ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో ఉగాది పురస్కారాలను అందిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయిదు రోజుల పాటు
కవులు, కళాకారులు, వృత్తి కళాకారులు, సాహితీ వేత్తలు క్రీడాకారులు, మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధిత సంఘసంస్కర్తలు ఉత్తమ రైతులను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని మంత్రి ఈశ్వర్ వివరించారు. ప్రధానంగా కరోనా సమయంలో పేదల సంరక్షణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటూ, ప్రతి ఇంటికి తిరిగి పలుమార్లు జ్వర సర్వే నిర్వహించి, 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో అందించడంలో ప్రతిభ కనబరిచిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ఏఎన్ఎంలు, ఐకెపి సిబ్బంది మొదలైన 500 మందిని సన్మానించి, సర్టిఫికెట్లు మెమొంటోలు అందించారు.
అనంతరం ప్రజలందరికీ మంత్రి , జిల్లా కలెక్టర్ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ధర్మపురి పట్టణంలో బుధవారం రాత్రి వివిధ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ధర్మారం బ్రిలియంట్ మోడల్ స్కూల్, ధర్మపురి చైతన్య భారతి విద్యా నికేతన్, కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విద్యా భారతి, మైనారిటీ స్కూల్ విద్యార్థుల వైవిద్య భరిత నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమాలలో భాగంగా వివిధ ప్రభుత్వ
పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి మెమోంటో, సంస్థ పక్షాన సర్టిఫికెట్లు, మోమెంటోలు,
మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధు శర్మ అందజేసి, శాలువాలతో సత్కరించారు
అలాగే ఈ కార్యక్రమంలో కొప్పుల ట్రస్ట్ చైర్ పర్సన్ స్నేహాలత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, ఎంపీపీ చిట్టిబాబు, బుగ్గారం జెడ్పీటీసీ రాజేందర్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్, పలు మండలాల, ప్రజాప్రతినిధులు, కళాకారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.