Monday, August 15, 2022
HomeNewsసిద్దిపేట కేసీఆర్ నగర కాలనీలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

సిద్దిపేట కేసీఆర్ నగర కాలనీలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ని కేసీఆర్ నగర కాలనీలో రెండు పడక గదుల ను అజయ్ జైన్ , ఆంధ్రప్రదేశ్ గ్రామ / వార్డు సచివాలయ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గారు సందర్శించడం జరిగింది. కాలనీలోని రెండు పడకగదులు , ఫంక్షన్ హాల్ , ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి గారు విశ్లేషించారు.

◆సిద్దిపేట పట్టణం అన్ని రంగాలలో ముందంజలో ఉందని , అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. రెండుపడక గదుల నిర్మాణం ద్వారా పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

◆కేసీఆర్ నగర్ లోని రెండు పడకగదుల అర్హుదారులైన వారికి ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి పేరు మీదనే నేరుగా అసెస్మెంట్ సర్టిఫికేట్ , మంచి నీటి కుళాయి మంజూరు పత్రం , ఇంటి యొక్క పట్టా సర్టిఫికేట్ , కరెంట్ మీటర్ సైతం వారి పేరు మీదనే ఇవ్వడం , ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ లు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

◆కేసీఆర్ నగర్ కాలనీ నివాసులు కొరకై అందుబాటులో తక్కువ ఛార్జీలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం , ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం బాగున్నాయని ప్రశంసించారు.

◆ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారు , మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు గారు , అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం గారు , RDO అనంత్ రెడ్డి గారు, మునిసిపల్ కమీషనర్ డా.కెవి.రమణా చారి గారు , అసిస్టెంట్ కమీషనర్ నర్సయ్య గారు కౌన్సిలర్ నర్సింలు గారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments